పెట్టుబడి లేకుండా ఆన్‌లైన్ ఉద్యోగాలు - Online Jobs without Investment

Header Ads Widget

పెట్టుబడి లేకుండా ఆన్‌లైన్ ఉద్యోగాలు - Online Jobs without Investment

పెట్టుబడి లేకుండా ఆన్‌లైన్ ఉద్యోగాలు 

ఎలాంటి ఇన్వెస్ట్మెంట్  లేకుండా జాబ్స్ పొందటం ఎలా అనేది ఇక్కడ మనం వివరంగా చూద్దాం.  డిజిటల్ ఫీల్డ్  వచ్చిన తర్వాత చాలా జాబ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి.  ఆన్లైన్ లో చేసే కొన్ని జాబులు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం .
ఇందులో ఏది వీలుగా ఉంటే దాన్ని నచ్చిన సమయంలో చేసుకుంటూ డబ్బు సంపాదించవచ్చు.  మీరు స్టూడెంట్ అయినా గృహిణి అయిన జాబ్ చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకొన్న వారైనా టైం  కుదిరినప్పుడు జాబ్ చేసుకోవడానికి వీలుగా చాలా వెబ్ సైట్లు మనకు జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. 

ఈ విభాగంలో, నేను ఎటువంటి పెట్టుబడి అవసరం లేని ఉద్యోగాల గురించి మాట్లాడబోతున్నాను. మరో మాటలో చెప్పాలంటే, మీకు  ఎటువంటి మనీ  ఖర్చు లేకుండా ఈ ఉద్యోగాలు చేస్తూ జీవించవచ్చు. వాటిలో కొన్ని ఫ్రీలాన్స్ ఉద్యోగాలు మరియు వాటిలో కొన్ని మీరు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్‌తో మీ ఇంటి నుండి చేయగలిగే ఉద్యోగాలు. ఇప్పుడు ఈ అవకాశాలను మరింత వివరంగా అన్వేషిద్దాం!

ఇంటర్నెట్ రాకతో ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఇంటి నుండి పని చేయడం సాధ్యమైంది. మీకు కావలసింది ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్‌టాప్ లేదా PC.

మీరు మీ ఆన్‌లైన్ ఉద్యోగాలపై రోజులో ఏ సమయంలోనైనా, వారంలోని ఏ రోజునైనా, ప్రపంచంలో ఎక్కడైనా పని చేయవచ్చు. ఇది మీ రెజ్యూమ్‌ను మెరుగుపరుచుకుంటూ మరియు డబ్బును సంపాదించేటప్పుడు మీ నైపుణ్యాలను పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది. ఆన్‌లైన్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మరింత జనాదరణ పొందుతున్నాయి ఎందుకంటే అవి ఉద్యోగార్ధులకు కొన్ని గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, మీకు కావలసినప్పుడు మరియు మీకు కావలసిన చోట పని చేసే సౌలభ్యం. మీరు ఆఫీసు వేళల గురించి ఆందోళన చెందకుండా లేదా ప్రతిరోజూ పనికి వెళ్లకుండా మీ స్వంత షెడ్యూల్‌ను రూపొందించుకోవచ్చు.

మీకు  ఏదైనా ఒక విషయం మీద ఒక ప్రత్యేకమైన అనుభవం ఉన్నట్లయితే దానిమీద మీరు జాబ్ చేసుకోవచ్చు.  ఉదాహరణకి సిస్టంలో మీరు టైపింగ్ చేయడం వస్తే డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా సెర్వే లో పార్టిసిపేట్  చేయొచ్చు.  ఆన్లైన్లో యూజర్  టెస్టింగ్ జాబ్స్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి చూద్దాం. 

ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల జాబితా(work from home jobslist )

  1. Dataentry 
  2. Online Typing Jobs
  3. Fill Online Surveys
  4. Start a YouTube Channel
  5. Sell Online Courses
  6. Start Online Lessons
  7. Be a Content Writer
  8. Join Freelancing Services
  9. Sell your Photos


డేటా ఎంట్రీ  (Dataentry ):

ఈ డేటా ఎంట్రీ జాబ్ లో నీకు టైపింగ్ వస్తే సరిపోతుంది స్పీడ్ గా టైప్ చేయగలిగితే జాబ్ చేయగలరు.  డేటా ఎంట్రీ మొబైల్ కూడా చేయవచ్చు.  డేటా ఎంట్రీ జాబ్స్ ఇవ్వడానికి చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇందులో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్  డబ్బులు కోసం అడిగితే ఇవ్వకండి.  రిజిస్ట్రేషన్ అడిగే వాడు శాలరీ ఇవ్వరు .  ఇది నా ఎక్సపీరియన్స్.  ఎవరైతే డబ్బులు తీసుకోకుండా వర్క్ ఇస్తారో  వారి దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వండి. 

ఆన్లైన్ టైపింగ్ జాబ్ (Online Typing Jobs):

ఆన్లైన్ టైపింగ్ జాబ్ అంటే ఇది ఒక రకంగా డేటా ఎంట్రీల నే ఉంటుంది అయితే ఇందులో రకాలు ఉంటాయి.  ఇచ్చిన టెక్స్ట్ ని ఆన్లైన్లో లో టైప్ చేయమంటారు.  కొంతమంది కేప్చ  టైప్ చేయమంటారు.  ఇలా  రకరకాల వర్క్స్ ఉంటాయి.  ఆన్లైన్ టైపింగ్ కి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది.

ఆన్లైన్ సర్వేస్ (Fill Online Surveys):

 ఆన్లైన్ సర్వే అనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది.  ఈ క్రింద కొన్ని సైట్లు ఇచ్చాము.  లాగిన్  చేసి  సర్వీస్ లో పాటిస్పేట్ చేయవచ్చు. 
  1. Swagbucks
  2. LifePoints
  3. TimeBucks Rewards
  4. SurveyJunkie
  5. Zen Surveys

యూట్యూబ్ ఛానల్ (Start a YouTube Channel)

యూట్యూబ్ ఛానల్ ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రజెంట్ సిచువేషన్ లో చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు.  మీ దగ్గర ఏ స్కిల్  ఉంటే అది సరిపోతుంది మీ దగ్గర ఉన్న విషయాన్ని పదిమందికి తెలియజేయండి మంచి ఆదాయం పొందండి.  యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. 


ఆన్లైన్ కోర్సులు అమ్మడం (Sell Online Courses)

 మీకు ఏదైనా టెక్నాలజీ మీద ఉంటే అవగాహన ఉంటే దాన్ని క్లాసులో రూపంలో ఒక వెబ్ సైట్ లేదా ఈబుక్స్  క్రియేట్ చేసి దాన్ని అమ్ముకోవచ్చు.  ఎవరైనా  నేర్చుకోవాలి అనుకునేవారు  దాన్ని కొనుక్కొని చదువుకొంటారు , కాబట్టి దాని వల్ల మీరు కూడా చాలా ఆదాయం పొందుతారు. 

ఆన్లైన్ లో క్లాస్ చెప్పండి (Start Online Lessons)

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరూ ఆన్లైన్ క్లాస్ లోనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  ఏ సబ్జెక్టులో అయినా పర్ఫెక్ట్ గా ఉంటే ఆ సబ్జెక్టు ఆన్లైన్ క్లాసులు రూపంలో అందరికీ తెలియజేయవచ్చు డాన్స్, పాటలు, ఏదైనా  సబ్జెక్టు టీచర్ అయినా, ఇక్కడి నుండి ఏ దేశంలో అయినా మీరు క్లాసులు చెప్పుకోవచ్చు.  ఇది చాలా బాగా ఉపయోగం పడుతుంది

కంటెంట్ రైటర్ (Be a Content Writer)

 కంటెంట్ రైటింగ్  ఇప్పుడు చాలా బాగా డిమాండ్ ఉన్న జాబ్ . మీకు కొంచెం ఇంగ్లీషులో పట్టుకుంటే కంటెంట్ రైటింగ్ వైపు వెళ్ళచ్చు. తెలుగు లో కంటెంట్  చేయవచ్చు. మీ మాతృభాష ఇంట్లో కూడా చేయొచ్చు.  గూగుల్ అన్ని భాషల్లో ఒప్పుకుంటుంది.  ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.  ఎక్కువ సంపాదిస్తారు. 

ఫ్రీలన్సర్ (Join Freelancing Services)

ఫ్రీలాన్సర్ అంటే మనకి వచ్చిన పనిని  మనకి నచ్చిన ప్పుడు  చేసుకుంటూ సంపాదించుకోవడానికి చాలా సులభమైన మార్గం.  ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ని చాలా వెబ్సైట్లు ఆఫర్ చేస్తున్నాయి రిజిస్టర్ చేసుకొని నీకు ఏం వర్క్ వచ్చో చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. 
  1.  Upwork
  2. WorkNhire
  3. Fiverr
  4. Guru
  5. Truelancer
  6. Freelancer
  7. Outsourcely
  8. 99 Designs
  9. People Per Hour
  10. Working Nomads
  11. Chegg
  12. Youth4Work

ఫోటోలు అమ్మండి (Sell your Photos)

 ఫోటోలు అమ్మడం ఎలా అంటే? మీ దగ్గర మొబైల్ గాని ఏదైనా ఒక మంచి కెమెరా గాని ఉంటే దాని తోటి మీరు  ఫోటోలు తీయడి. మంచి మంచి ఫోటోలు తీసి వెబ్సైట్లలో పెట్టవచ్చు.  ఫొటోలు నచ్చినవాళ్లు  ఫోటోలు కొనుక్కొని అమౌంట్ ఇస్తారు. మీరు ఎక్కడికైనా మంచి ప్లేస్ కి వెళ్ళినప్పుడు అవి  కూడా తీసి మీరు వెబ్ సైట్ లో ఉంచండి . ఫోటోలో అమ్మడానికి చాలా వెబ్సైట్లు ఉన్నాయి అవి ఇస్తాను
  1. Getty Images
  2. 500px. 
  3. Stocksy. 
  4. Alamy.
  5. iStock. 
  6. Adobe Stock.
  7. Dreamstime
  8. Shutterstock


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు