పరిచయం :
రెజ్యూమ్ అనేది ఒక అద్దం లాంటిది మనం ఎలా ఉంటే అలా ఎదుటి వాళ్ళకి చూపించగలిగే ఒక గొప్ప సాధనం. ఇది కూడా ఒక రకమైన మార్కెటింగ్. రెజ్యూమ్ అనేది మనల్ని మన స్కిల్స్ మీ కంపెనీ వాళ్ళకి పరిచయం చేసే ఒక వారధి లాంటిది మనం దీనిని ఎంత బాగా డిజైన్ చేసి ఎదుటి వాళ్ళని మేప్పించగలుగుతామో దానిమీద ఆధారపడి ఉంటుంది మన లైఫ్. మనకి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మనం రెజ్యూమ్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే అంత బాగా ఎంత ఎక్కువగా కాల్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే రెజ్యూమ్ కూడా ఒక రకమైన మార్కెటింగ్ టెక్నిక్ మనల్ని మార్కెట్ లో పరిచయం చేసేది ఈ రోజు మన స్కిల్స్ ని మన టాలెంట్ ని మనం చేసిన ప్రాజెక్టులను మనకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ అందులో అందులో పెట్టుకొని మనల్ని మార్కెట్ చేసుకోవడంనికి రెజ్యూమ్ బాగా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ఒక జాబ్ కి అప్లై చేయాలి అంటే మన కంటే ముందు రెజ్యూమ్ మనల్ని కంపెనీ కి పరిచయం చేస్తుంది.
రెజ్యూమ్ తయారు చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఎలా చేయాలి అనేది చూద్దాం.
Resume Creation Tips:-
- రెజ్యూమ్ లో ఉన్న స్కిల్స్ తో జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న స్కిల్స్ తో సరిపోయే విధంగా ఉండాలి.
- మీ జాబ్ కి సరిపోయే రెజ్యూమ్ కొన్ని చూడండి, దానివల్ల మీకు తెలుస్తుంది ఎలా ఉండాలి రెజ్యూమ్ అని.
- చదవటానికి సులువుగా, ఎదుటివారికి అర్థం అయ్యే విధంగ ఉండాలి.
- వివరంగా పాయింట్ టు పాయింట్ మనగురించి , మన ఎక్సపీరియన్స్ గురించి చెప్పాలి.
- రెజ్యూమ్ లో ఫాంట్ సైజు ప్రొఫిషనల్ గ ఉండాలి.
- తక్కువ పదాలతో ఎక్కువ విషయం చెప్పాలి.
- సబ్ headings పెట్టాలి.
- రెజ్యూమ్ లో మార్జిన్స్ సరిగ్గా పెట్టాలి.
- ఒకసారి మళ్లి చదవాలి, తప్పులను సరిచేసుకోవాలి.
- మీ రెజ్యూమ్ ప్రత్యేకంగా ఉండాలి.
రెజ్యూమ్ తయారు చేయడం(Resume Creation):-
మీరు రెజ్యూమ్ చేసేటపుడు మీ సంప్రదింపు సమాచారం(contact information) సరిగ్గా ఇవ్వాలి. ఇందులో మొబైల్ నెంబర్, ఇమెయిల్ id, మీ పేరు మొదట ఇవ్వాలి. మీ రెజ్యూమ్ లో ప్రత్యేకంగ విద్య, అనుభవం మరియు సంబంధిత నైపుణ్యాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి.
1. డిస్క్రిప్షన్ మరియు ఉద్యోగ నియామకాలు:
ముందు జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవండి, ఎలాంటి అభ్యర్థి కోసం యజమాని ఏమి వెతుకుతున్నారో తెలుసుకోండి, ఆ విధంగా మీరు మీ రెజ్యూమ్ తయారు చేయండి.
ఉదాహరణ : డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు అభ్యర్థి కోసం చూస్తున్నారు. వాళ్ళు కొన్ని స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, SEO, on-page, ఆఫ్-page, SMO, బ్యాక్ లింక్స్, మొదలైనవి.. మీకు వాళ్ళు ఇచిన జాబ్ స్కిల్స్ చెక్ చేసికొని, వాటిని మీరు మీ రెజ్యూమ్ లో ఉంచండి. అప్పుడు మీకు కంపెనీ నుండి కాల్ వచ్చే అవకాశం ఉంటుంది.
2. మీ జాబ్ కి సరిపోయే రెజ్యూమ్ కొన్ని చూడండి:
కంపెనీ యజమానులకు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి రెజ్యూమ్ ని సరళంగా మరియు సులభంగా చదవగలిగేలా తయారుచేయండి. క్లుప్తంగా, ప్రొఫెషనల్ గా ఉండేలా చూసుకోండి.
3. చదవటానికి సులువుగా, ఎదుటివారికి అర్థం అయ్యే విధంగ ఉండాలి
ముఖ్యామైన విషయాలు అన్ని బుల్లెట్ పాంట్స్ లో పెట్టండి. మీ వర్క్ కి సంబదించిన అన్ని విషయాలు, క్లుప్తంగా విశదీకరించండి .
4. వివరంగా పాయింట్ టు పాయింట్ మనగురించి , మన ఎక్సపీరియన్స్ గురించి చెప్పాలి:
మనకున్న ఎక్స్పీరియన్స్ ని మొత్తం చెప్పాలి, ఏ కంపెనీలో లేద ఏ ప్రాజెక్టులు చేశాము మనకి వచ్చిన మెడల్స్ ఇట్లా ప్రతి విషయాన్ని కంప్లీట్గా చెప్పాలి.
5. రెజ్యూమ్ లో ఫాంట్ సైజు ప్రొఫిషనల్ గ ఉండాలి:
రెజ్యూమ్ లో పెట్టే ఫాంట్ సైజ్ అనేది చాలా ముఖ్యమైనది, ఈ ఫాంట్ సైజ్ ని బట్టి మనం ఎదుటి వాళ్ళని మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది, ఫాంట్ సైజు 10 నుండి 12 వరకు పెట్టుకోవచ్చు అంతకన్నా పెద్ద గా పెడితే చూడ్డానికి బాగోదు చిన్నగా పెడితే అర్థం కాదు అది కరెక్ట్ సైజు.
6. తక్కువ పదాలతో ఎక్కువ విషయం చెప్పాలి:
రెజ్యూమ్ లో మనం ఎంత తక్కువ పదాలు వాడితే అంత మంచిది, ఎందుకంటే మన రెజ్యూమ్ మొత్తం చదివే టైం వాళ్ళకి ఉండదు కాబట్టి మనం ఎంత తక్కువ పదాలను ఉపయోగించి రెజ్యూమ్ చేసుకోటే అంత ఎక్కువగా మన గురించి ఎదుటి వాళ్లకు తెలిసే అవకాశం కూడా ఇవ్వగలం. ఇంపార్టెంట్ పాయింట్స్ కి బుల్లెట్ పాయింట్స్ కానీ ఒక హైలైట్ చేయడం గానీ చేయవచ్చు అలా అయితే ఆ డైరెక్ట్ పాయింట్స్ వాళ్ళకు అర్థం అవుతాయి.
7. సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి:
సబ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి దీని ద్వారా మనం ఏమి రాస్తున్నాము అనే విషయం వాళ్ళు హెడ్డింగ్ చూసి గ్రహిస్తారు కాబట్టి మీరు కంపల్సరిగా సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. అంటే మీ స్కిల్స్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ డీటెయిల్స్ ఇలా అన్నిటికి సబ్ హెడ్డింగ్ పెట్టండి.
8. రెజ్యూమ్ లో మార్జిన్స్ సరిగ్గా పెట్టాలి:
మార్జిన్ వదిలి పెట్టడం అనేది మన ఒక మంచి లుక్ ని ఇస్తుంది. మార్జిన్ సైజెస్ 1 ఇంచ్ పెట్టొచ్చు, లైన్స్ మధ్యన ఒక సింగిల్ పేస్ అనేది పెట్టొచ్చు ఇలా చేయడం వల్ల రెజ్యూమ్ అందంగా కనిపిస్తుంది.
9. ఒకసారి మళ్లి చదవాలి, తప్పులను సరిచేసుకోవాలి:
రెజ్యూమ్ అంత తయారుచేయడం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చదవండి. ఇది చదివి అందులోని తప్పులను సరి చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళకి అది చూపించి అందులోనే తప్పులను సరి చేసుకోండి. పర్ఫెక్ట్ గా ఉండాలి, అది మనల్ని ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి దానిని సాధ్యమైనంత వరకు సులువుగా అందరికీ అర్థమయ్యేలా గా, చూడటానికి గుడ్ లుకింగ్ ఉండేలాగా చూసుకోవడం చాలా ముఖ్యం.
10. మీ రెజ్యూమ్ ప్రత్యేకంగా ఉండాలి:
సాధారణంగా అందరి రెజ్యూమ్ ఒకే లాగా ఉంటాయి కానీ అలా కాకుండా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త వహిచండి. దానిని బట్టి కంపెనీ వాళ్ళు ఒక అంచనాకు వస్తారు, అందరికంటే కంటే ముందు మీకు ఒక కంపెనీ నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందరి కంటే కాస్త భిన్నంగా కొత్తగా ఆలోచించి తయారుచేయండి.
ఆన్లైన్లో మీకు రకరకాల రెజ్యూమ్ టెంప్లేట్స్ ఉంటాయి వాటిని చూడండి. మీ స్కిల్స్ కి సరిపోతాయి అనుకున్న వాటిని మాత్రమే తీసుకోండి.
ఫ్రీ రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు.
ఉదా : www.canva.com వాళ్ళు ఫ్రీ ఆన్లైన్ రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇంకా free online resume building అని టైపు చేస్తే చాల వెబ్సైటు వస్తాయి. వాటిని ఉపయగించుకొని రెసుమె తయారు చేసుకోవచ్చు.
నోట్: కొన్ని కంపెనీల వాళ్లు రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ మీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీళ్లు కొంచెం మనీ తీసుకుని రెజ్యూమ్ తయారు చేస్తారు ఇలా కూడా చేయవచ్చు.
కంక్లూషన్ :
రెజ్యూమ్ ప్రతిఒక్కరికీ బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళ కన్నా ముందు వాళ్ళ గురించి కంపెనీ వాళ్ళకి తెలియజేసేది మన రెజ్యూమ్ కాబట్టి దీనికి చాలా విలువ ఉంటుంది, రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్లో మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇలా మోసపోకుండా మీరు మంచి కంపెనీ లో రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ ని తీసుకోవాలి, ఆ కంపెనీ గురించి రివ్యూస్ చదవాలి, ఎంక్వయిరీ చేయాలి ఎవరో తక్కువ చేస్తున్నారు ఎవరు నిజగా చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు డబ్బులు అనేది కట్టాలి.
మీ సలహాలు, సూచనలు క్రింద కామెంట్ చేయవచు. మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అన్న క్రింద కామెంట్ చేయండి.
0 కామెంట్‌లు