మనం SEO ఉపయోగించి డబ్బు సంపాదించడం ఎలా ?
SEO ఉపయోగించి డబ్బు సంపాదించడం ఎలా ? |
SEO అంటే ఎమిటి?
SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ (search engine optimization). ఇది మన వెబ్సైటు ని సెర్చ్ ఇంజిన్ లో కనిపిచేలా చేస్తుంది.
ఉదా: మనం ఒక జాబ్ గురంచి చూస్తున్నాము, దానిని గూగుల్ లో సెర్చ్ చేశాము అనుకోండి చాల వెబ్సైట్ వస్తాయి. ఇంకా కొన్ని వెబ్సైట్ ఫస్ట్ పేజీ లోకి రావు కారణం SEO. SEO చేయడం వల్ల మన వెబ్సైటు గూగుల్ లో ఫస్ట్ పేజీ లో కనిపిస్తుంది.
మనకి ఒక వెబ్సైటు ఉంది అనుకోండి, దానిని గూగుల్ లో కనిపిచాలి అనుకొందాం, దానికోసం మనం SEO చేయాలి.
SEO ఎలా చేయాలి ?
SEO ముఖ్యంగా 4 రకాలు
1. ఆన్-పేజీ SEO (on -page SEO )
2. ఆఫ్-పేజీ SEO (off-page SEO )
3. సాంకేతిక SEO(Technical SEO )
4. లోకల్ SEO(Local SEO )
1. ఆన్-పేజీ SEO (on -page SEO ):-
ఆన్-పేజీ SEO అంటే వెబ్సైటు లోపల చేసే పనిని ఆన్-పేజీ SEO అంటారు. అది ఎమిటో ఇప్పుడు చుద్దాం . ఫస్ట్ మనకి ఒక పేజీ కి టైటిల్ కావాలి, ఎందుకు అంటే మనం ఎం చెప్పాలి అనుకుంటున్నాము అనేది వివరించాలి . తరువాత డిస్క్రిప్షన్ మరియు కీవర్డ్స్ కావాలి . ఈ కీవర్డ్స్ ని ఉపయోగిచి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైటు ఫస్ట్ పేజీ లో వస్తుంది.
టైటిల్ ఎంత ఉండాలి ?
మన టైటిల్ 60-65 అక్షరాల లోపల ఉండాలి మరియు మెయిన్ టాపిక్ కీవర్డ్స్ టైటిల్ లో ఉండాలి.
డిస్క్రిప్షన్ ఎంత ఉండాలి?
డిస్క్రిప్షన్ 50 నుండి 160 అక్షరాల లోపల ఉండాలి మరియు మెయిన్ కీవర్డ్స్ మరియు సబ్ కీవర్డ్ కూడా ఉండాలి .
కీవర్డ్స్ ఎంత ఉండాలి?
కీవర్డ్స్ అనేవి సెర్చ్ ఇంజిన్ మీద ఆధారపడి ఉంటాయి . మీరు ఉపయోగిచే మెటా కీవర్డ్‌ల సంఖ్యపై అధికారిక పరిమితి లేదు.
2. ఆఫ్-పేజీ SEO (off-page SEO )
అఫ్-పేజీ SEO అనేది వెబ్సైటు బయట చేసే పని. అంటే వెబ్సైటు కి ట్రాఫిక్ తీసుకునిరావటం. ఎక్కువ మంది చేసేల చేయడం . మనం ఒక ఆర్టికల్ వెబ్సైటు లో పెట్టిన తరవాత దాని లింక్ ని సోషల్ మీడియా లో పెట్టడం మరియు బ్యాక్ లింక్స్ తయారు చేయడం లాంటివి. దీనివలన మన మన వెబ్సైటు కి జనాదరణ, నమ్మకం, విశ్వసనీయత పెరుగుతాయి.
3. సాంకేతిక SEO(Techinical SEO )
సాంకేతిక SEOలో ఇండెక్సింగ్, క్రాలింగ్, రెండరింగ్ మరియు వెబ్‌సైట్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి.
క్రాలింగ్:- మన వెబ్‌సైట్ని సెర్చ్ ఇంజన్ తెలుసుకోవడం.
ఇండెక్సింగ్:- మన వెబ్‌సైట్ని సెర్చ్ ఇంజిన్ గుర్తు ఉంచుకోవడం .
వెబ్‌సైట్ ఆర్కిటెక్చర్ : ఎలా ఉంటె వెబ్‌సైట్ని సెర్చ్ ఇంజిన్ తీసుకొంటుంది అనేది వెబ్‌సైట్ఆర్కిటెక్చర్ నిర్ణయిస్తుంది.
4. లోకల్ SEO(Local SEO ):
ఈ లోకల్ SEO అనేది స్థానికంగా ఉన్న వ్యాపారం వృద్ధికి ఉపయోగపడుతుంది.
SEO ఉపయోగించి డబ్బు సంపాదించడం ఎలా ?
ఇప్పుడు మనం SEO 2 రకాలుగా ఉపయోగిచి డబ్బు సంపాదించవచ్చు.
1. ఉద్యోగం చేసి
2. వ్యాపారం తో
1. ఉద్యోగం:
ఉద్యోగం కోసం మొత్తం SEO నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ లోని ఇంకా SMO కూడా నేర్చుకోవాలి . మన స్కిల్స్ ఆధారంగా మనకి జాబ్స్ వస్తాయి. డిజిటల్ మార్కెట్ లోని 2 లేదా 3 మోడ్యూల్స్ నేర్చుకోలి .
2. వ్యాపారం: వ్యాపారం చేసేవాళ్ళకు SEO బాగా ఉపయోగపడుతుంది.
SEO ఆప్టిమైజేషన్ ని ఉపయోగించి మనం బాగా సంపాదించుకోవచ్చు ఎలా అంటే మన వెబ్ సైట్ ని ఆన్ లైన్ లో పెట్టి దాన్ని గూగుల్ లో టాప్ పొజిషన్ లోకి తీసుకుని వచ్చి మన బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. మన వ్యాపారం ఏదైనా సరే ఆన్లైన్లో చేయడం ద్వారా త్వరగా వినియోగదారులను చేరుకోవచ్చు. మంచి రాబడిని పొందవచ్చు. ఆన్లైన్ లో బిజినెస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం లో ఎక్కడైనా బిజినెస్ చేయచ్చు. మంచి లాభాలు పొందవచ్చు. మనకి SEO అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది SEOలో మొదట మనకు కావలసిన కీవర్డ్స్ ఉపయోగించటం తెలియాలి . ఈ కీవర్డ్స్ ని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ లో ఎవరైతే కీవర్డ్స్ తో చేస్తారో వాళ్లకి మన ప్రోడక్ట్ కనిపిస్తుంది. మనం వ్యాపారం చేయాలంటే ఒక వెబ్సైట్ కావాలి ఆ వెబ్సైట్లో మనకు కావలసిన విషయాలను స్పష్టంగా రాయాలి ఆ పేజీకి ఓ మంచి పేరు పెట్టాలి అది చాలా ముఖాయమైంది . కంటెంట్ అనేది ఆకర్షించేలా ఉండాలి తర్వాత విషయం చాలా స్పష్టంగా రాయాలి.
గమనిక :- మీకు SEO రాకపోతే ఎవరైనా SEO తెలిసిన వాళ్ళకి మీ వెబ్సైట్ ఇచ్చి వర్క్ చేపించుకొండి.
జాబ్ Qualification or బిజినెస్ లేకపోతే ఎమీ చేయాలి?
ఇంటర్నెట్ లో ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయ్. కాకపోతే కొంచం వర్క్ చేయాలి అది ఏంటి అంటే
1. సోషల్ మీడియా (ఇది అందరికి తెలుసు)
2. ఫోటోగ్రఫీ (ఇది ఎవరైనా చేయవచ్చు)
3. అఫిలియేటె మార్కెటింగ్.
4. రివ్యూస్
5. సర్వేలు
6. రిసెల్లింగ్
ఇంకా చాల ఉన్నాయి, వాటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక్కక్క దానిగురించి వివరంగా చెపుతాను.
0 కామెంట్‌లు