వెబ్‌సైట్ లేకుండా వ్యాపారం ఎలా చేయాలి? | How to do a Business Without a Website?

Header Ads Widget

వెబ్‌సైట్ లేకుండా వ్యాపారం ఎలా చేయాలి? | How to do a Business Without a Website?

How to do a Business Without a Website?

వెబ్‌సైట్ లేకుండా వ్యాపారం ఎలా చేయాలి?

వెబ్‌సైట్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహించడం సాధ్యమేనా? అంటే సమాధానం సాధ్యమే.  వెబ్సైటు లేకుండా చాలామంది బిజినెస్ ఆన్లైన్లో చేస్తూనే ఉన్నారు .  వెబ్సైట్ అనేది బిజినెస్ కి చాలా ముఖ్యం ఎందుకంటే మన బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు వెబ్ సైట్ లో ఒక చోట పెట్టుకోవచ్చు దానివల్ల ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే చోట దొరుకుతుంది.  వెబ్సైట్లో మనం ఏమేమి పనులు చేస్తాము,  మన ఆఫీస్ ఎక్కడ ఉంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మన సర్వీస్ ఏంటి, వాటిని ఎలా చేస్తాము, ప్రతిదీ ఆన్లైన్లో ఇంటర్నెట్ లో పెట్టుకుంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్ సైట్ కనిపిస్తుంది అప్పుడు డైరెక్టుగా మన దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఎవరికైనా వెబ్సైట్ కావాలి అంటే చేసి ఇస్తాము.  వెబ్సైట్ లేకుండా కూడా కొంతమంది వర్క్ చేస్తున్నారు అది ఎలా ఉందో చూద్దాం. 

సోషల్ మీడియా

 ఇప్పుడు మనకు బాగా ప్రాచుర్యం పొందినది సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా ద్వారా కూడా బిజినెస్ నిర్వహించవచ్చు ఫేస్బుక్ పేజీలో మనం మనం బిజినెస్  వివరాలన్నీపొందుపర్చి  దానిని గ్రూప్లో షేర్ చేయడం ద్వారా బిజినెస్ తెచ్చుకోవచ్చు.  అలానే  లింక్డ్ ఇన్  లో కూడా తెచ్చుకోవచ్చు. ఏ  సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా వివరాలు ఇచ్చి మనం ఏమేమి పనులు చేస్తాము వివరిస్తే' నచ్చిన వాళ్ళు మనల్ని  కాంటాక్ట్ అవుతారు 

ఇది ఎవరికి బాగా ఉపయోగం?

 ఇది ఎవరికి బాగా ఉపయోగం అంటే టీచర్, డాక్టర్స్, లాయర్, బ్యూటీ క్లినిక్, ఇలా సొంతంగా బిజినెస్  చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఇలా రకరకాల చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు.   వెబ్సైట్ తయారు చేయించుకుని దానిని ఉపయోగించుకోలేని ఆర్థిక స్థితిలో ఉన్న వాళ్ళు,  ఇలాంటి వాళ్లకి ఫ్రీగా ఉండే సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది అలాగే బిజినెస్ కూడా బాగా వస్తుంది, నేను చాలా నమ్మకంగా చెప్పగలను ఎందుకంటే చాలా మందికి ఇలా సోషల్ మీడియా ద్వారా బిజినెస్ని తెచ్చాను.  ఇది నా ఎక్స్పీరియన్స్ తో  తెలుసుకున్న విషయం. 

మీరు మీ బిజినెస్ ల తో చాలా బిజీ గా ఉన్నారా? 

 సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం అనేది ఎవరైనా చేయవచ్చు తెలియకపోయినా ఆన్లైన్లో చాలా వీడియోలు బ్లాక్ సి ఉంటాయి వాటిని చూసి నేర్చుకుని మీరు సోషల్ మీడియా సర్వీసెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. 

లేక

మీరు మీ బిజినెస్ ల తో చాలా బిజీ గా ఉన్నారా? అయితే మీ  బిజినెస్ కి సంబంధించిన సోషల్ మీడియా ఆక్టివిటీస్ అన్ని మేము చక్క నిర్వహించగలo.   ఎవరికైనా సోషల్ మీడియా మేనేజ్మెంట్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు మేము వారికి సోషల్ మీడియా సర్వీసెస్ అందిస్తాము.  మేము డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలతో కలసి ఈ సర్వీసుల్ని మీకు అందిస్తున్నాం. 

 ఈ కామర్స్(E Commerce):-

ఈ కామర్స్ బిజినెస్  చేస్తున్నారా అయితే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టలేక ఫస్ట్ ట్రై చేద్దాం అనుకుంటే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు మీ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవచ్చు, ఫేస్బుక్ లో ఆప్షన్ ఉంది అది మార్కెట్ ప్లేస్, అక్కడ మీరు మీ ప్రొడక్ట్స్ ని పెట్టుకొని అమ్ముకోవచ్చు. 

 ఫేస్బుక్ మార్కెట్  ప్లేస్ లో కూడా చాలా బాగా సేల్స్ జరుగుతాయి, ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది.  మార్కెట్ ప్లేస్ లో నేను కూడా ప్రొడక్షన్ ని  సేల్ చేశాను. 

 ఆన్లైన్ స్టోర్ :-

ఆన్లైన్ స్టోర్స్ అనేది చాలా కంపెనీలు ఇస్తున్నాయి అంటే మీరు నెలకి  కొంత అమౌంట్ పే చేస్తూ మీరు ఉపయోగించుకోవచ్చు. 

 ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్స్ :

www.shopify.com

www.wix.com

www.bigcommerce.com

 ఇంకా చాలా వెబ్సైట్ ఉన్నాయి , వాటి అన్నిటి గురించి వివరణ మరొకసారి ఇస్తాను.  అవి ఎలా వర్క్ అవుతాయి వాటికి డబ్బులు ఎంత కట్టాలి ఎలా ఉపయోగించుకోవాలి దాని వల్ల ఉపయోగాలు నష్టాలు ఏంటి వి అనేదాన్ని వివరణాత్మకంగా చూద్దాం తర్వాత బ్లాగులో. 

 ఈ మెయిల్ మార్కెటింగ్:

 ఇమెయిల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం మన బిజినెస్ ని పెంచుకోవచ్చు ఇది కూడా వెబ్సైట్ లేకపోయినా బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు