డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ ఎలా పొందాలి? | how to get a Digital Marketing Internship?

Header Ads Widget

డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ ఎలా పొందాలి? | how to get a Digital Marketing Internship?

 
Digital Marketing Internship?

డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ ఎలా పొందాలి? 

ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్  మీద ఆధారపడుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్లే  కాదు ప్రతి టెక్నాలజీలోను ఇంటర్న్షిప్   కోసం చూస్తున్నారు.  దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.  సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అలాగే వర్క్ ఎక్సపీరియన్సు కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత చాలా వెబ్ సైట్స్ ఇంటర్న్షిప్స్  ఎక్కడెక్కడ ఇస్తారు వాటి వివరాలు మొత్తం పొందుపరుస్తున్నారు, ఆ వెబ్సైట్లోకి వెళ్లి మనం అప్లై చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ ని పొందవచ్చు.  అక్కడ కూడా కాంపిటీషన్ బాగా పెరిగింది కాబట్టి మనకి ఇంటర్న్షిప్లు వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. 

మనం చాలా ఓపిక తో ఎదురుచూడాలి, వచ్చిన అన్ని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి కొన్ని కంపెనీలకు మనం నచ్చకపోవచ్చు, కొన్ని కంపెనీలు మనకి నచ్చకపోవచ్చు ఇలా చాలా కంపెనీలు అటెండ్ అవుతూ ఉంటే మనకు ఇంటర్న్షిప్ లు  వస్తాయి. 

అన్నీ పెద్ద కంపెనీలే  ఉంటాయని లేదు చిన్న చిన్న కంపెనీలు startups అన్నీ ఉంటాయి ఒకసారి మనం జాబ్ కి జాయిన్ అయ్యే ముందు ఆ కంపెనీ గురించి వెరిఫై చేసుకోవడం మంచిది.  ఎందుకంటే కొన్ని కంపెనీల మోసం చేసేవి  కూడా ఉంటాయి.  పని చేసినతరవాత  తర్వాత డబ్బులు ఇవ్వరు ఇలాంటి వాటిని చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం చాలా మంచిది.  మీరు ఈ కంపెనీలకు  అప్లై చేయడానికి ఒక మంచి రెస్యూమే తయారుచేసుకోండి, అది మీకు మంచి జాబ్ రావడానికి సహాయపడుతుంది. 

Note :-  ఎవరైతే జాబ్ కోసం డబ్బులు ఇవ్వమంటారో  ఆ కంపెనీ కచ్చితంగా మోసం చేసే కంపెనీ,  దింట్లో ఎలాంటి అనుమానం లేదు,  మీరు ఎవరు పొరపాటున కూడా డబ్బులు ప్లే చేయకండి.  మీరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. 

ఇంటర్న్షిప్ రెండు రకాలు ఉంటాయి 

1 ఇంటర్న్షిప్ కి  పరిమిత వేతనము(stipend) ఇస్తారు. 

2. ఇంటర్న్షిప్ కి  పరిమిత వేతనము(stipend) ఇవ్వరు. 

 మీకు ఎలాంటి ఇంటర్న్షిప్ నచ్చితే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ  ఇంటర్న్షిప్స్ అయితే త్వరగా ఇస్తారు మీకు డబ్బులు వద్దు ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు లేదు మాకు శాలరీ కూడా కావాలి అనుకుంటే పెయిడ్ ఇంటర్న్షిప్ లో జాయిన్ అవచ్చు. 

ఇంటర్న్షిప్ వెబ్సైట్ :

www.makeintern.com

www.internshala.com

 ఫై వెబ్సైట్లో లాగిన్ మీకు కావాల్సిన ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత జాబ్ లో కి   తీసుకునే  అవకాశము కూడా ఉంటుంది, మీరు జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదువుకొని  వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుని అప్లై చేయండి.

 కంపెనీస్ :

మీకు  ఇలా జాబ్స్ రాలేదనుకోండి ఇంకొక రకంగా కూడా మీరు మీ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అదెలా అంటే మీరు ఇంటర్నెట్ లోకి వెళ్లి సెర్చ్ చేయండి షిప్స్ ఏ కంపెనీలలో  ఉన్నాయో చూడండి ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయండి అలా కూడా మీకు ఇంటర్న్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది

 ఫేస్బుక్ గ్రూప్స్ :

ఫేస్ బుక్ గ్రూప్ లో  మీకు రిలేటెడ్ గా ఉన్న వాటిలో జాయిన్ అవ్వండి అందులో కంపల్సరిగా అయితే జాబ్స్  పోస్ట్ చేస్తూనే ఉంటారు.  వాటికి కూడా అప్లై చేయండి  అలా కూడా మీరు ఇంటర్న్షిప్  తెచ్చుకోవచ్చు. 

Linkedin : 

 లింక్డ్ ఇన్ లో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి.  లింక్డ్ ఇన్ లో  ఎకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఇంటర్న్షిప్స్ కి  అప్లై చేయవచ్చు.  లింక్డ్ ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వరకు మంచి కంపెనీలో జాబ్  ఉంటాయి. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు