Facebook మార్కెటింగ్ టూల్స్ పరిచయం :
ఫేస్బుక్ కి ప్రపంచం మొత్తం మీద 2.45 బిలియన్ మంది యూజర్లు ఉంటారు, ఫేస్బుక్ అనేది చాలా పెద్ద సోషల్ నెట్వర్క. ప్రపంచం మొత్తం మీద ఇంత పెద్ద సోషల్ మార్కెటింగ్ అనేది ఏది లేదు కాబట్టి చాలామంది దీన్నిఉపయోగించుకుంటారు, కంపెనీ వాళ్లు తమ ప్రోడక్ట్ ని కానీ సర్వీసెస్ కానీ facebook ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ సోషల్ నెట్వర్క్ ఫాలో ఐయేవాళ్లు అందరు వాళ్ళకి కావలసిన ప్రొడక్షన్ సర్వీస్ ని గానీ దీని ద్వారా అందుకుంటూ ఉంటారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్ వాళ్ళు కొన్ని టూల్స్ ని వాళ్ళ యొక్క ఉసెర్స్ కి అందించడానికి తీసుకువచ్చారు. వాటిని తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని, మనం ఉపయోగించుకోవడం ద్వారా మనం మన పనిని సులభతరం చేసుకోవచ్చు. లాభాలు పొందవచ్చు.
Facebook మార్కెటింగ్ టూల్స్:
- Facebook Analytics
- Facebook Ad Library
- Facebook Audience Insights
- Facebook Creative Hub
- Facebook Ads Manager
- Facebook Pages
ఫేస్బుక్ ఎనలిటిక్స్(Facebook Analytics):
ఫేస్బుక్ ఎనలిటిక్స్ టూల్ అనేది మన బిజినెస్ యొక్క insites తెలియజేస్తుంది. మన ఇమేజెస్ ని ఎంతమంది లైక్ చేసారు, ఎంతమంది చూసారు, మానిటైజేషన్ ఎలా ఉంది, అనే విషయాలను చూపిస్తుంది, ఈ ఫేస్ బుక్ అనలిటిక్స్ ఫేస్బుక్ అన్నీ ఉత్పత్తులకి ఉపయోగించుకోవచ్చు ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ వెబ్సైట్, ఇలా మొదలైన వాటన్నిటికీ ఉపయోగించుకోవచ్చు, ఇన్సైట్ అలెర్ట్ పంపిస్తుంది.
ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ (Facebook Ad Library):
యాడ్ లైబ్రరీ అనేది యాడ్ లెక్షన్ డేటాని చూపిస్తుంది. ఫేస్బుక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన యాడ్స్ ఎలా ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క యాక్టివిటీస్ మొత్తాన్ని చూపిస్తుంది
ఫేస్బుక్ ఆడియన్స్ ఇన్సైడ్(Facebook Audience Insights)
ఈ ఇన్ సైట్స్ లో మన బిజినెస్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో తెలుసుకోవచ్చు దీంట్లో డేటా అనేది మనకి ఇస్తుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమి చేస్తున్నారు, జెండర్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటి , మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ల జాబ్ టైటిల్స్ ఏంటి ,వాళ్లకి రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏమిటి, ఇలా ప్రతిదీ మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళకి మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఫేస్బుక్ క్రియేటివ్ హబ్ (Facebook Creative Hub):
ఈ టూల్ ని ఉపయోగించుకొని మనం ఒక మంచి ఎఫెక్టివ్ గా యాడ్ డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఒక క్రియేటివ్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి అని నేర్చుకోవచ్చు, mockups ఉంటాయి, ప్రివ్యూ ఉంటుంది. ఇందులో ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ యాడ్స్ కూడా వైవిధ్యభరితంగా చేసుకోవచ్చు అలా క్రియేట్ చేసుకోవడం వల్ల మన క్యాంపెయిన్ యొక్క ఒక ప్రేఫార్మన్స్ అనేది పెరుగుతుంది.
ఫేస్బుక్ యాడ్ మేనేజర్(Facebook Ads Manager)
ఇది చాలా ఇంపార్టెంట్ దీనిని ఉపయోగించి మనం ప్రకటనలు ఇవ్వవచ్చును. దీనిద్వారా ప్రకటనలు ఫేస్బుక్ లోను ఇవ్వచ్చు, ఇంస్టాగ్రామ్ లోను, మెసేంజర్ లోనూ మరియు ఆడియన్స్ నెట్వర్క్ లో ను యాడ్స్ ని డైరెక్ట్ గా ఇవ్వవచ్చు. ఇందులో రియల్ టైం లో రిపోర్ట్ వస్తుంది. ఎంతమంది చూస్తున్నారు బడ్జెట్ ఎంత పడుతుంది సంబంధించినవి ఉంటాయి యాడ్ ని ఎలా పెట్టాలో ఇందులో మొత్తం క్లియర్ గా, ఇది పవర్ ఫుల్ టూల్.
యాడ్ మేనేజర్ ఉపయోగించి కొన్ని లక్షల మంది రోజు బిజినెస్ యాడ్స్ ని ఇస్తూ ఉంటారు.
ఫేస్బుక్ పేజీ(Facebook Pages):
ఫేస్బుక్ పేజీ అనేది ఒక టూల్ , దీనిని ఉపయోగించి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే ఉంటారు, పేజీ ద్వారా తమ బిజినెస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు ఈ టూల్ నుపయోగించి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తుంటారు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని బిజినెస్ లో వాళ్ళు ఉపయోగించుకునేది ఏ పేస్ బుక్ పేజీ టూల్. ఇది బేసిక్ టూల్.
మీ కోసం :
0 కామెంట్‌లు