ఏ స్కిల్స్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేయవచ్చా?
ఏ స్కిల్స్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేయవచ్చా? అంటే చేయవచ్చు. కానీ డిజిటల్ మార్కెటింగ్అంటే ఏంటో తెలియకుండా, అది ఎలా చేస్తారో తెలియకుండా చేయడం మాత్రం కష్టం. కానీ దాని గురించి మొత్తం తెలుసు కోనీ ఎలా చేయాలో నేర్చుకుంటే జాబ్ చేయొచ్చు. ఏ స్కిల్స్ లేకుండా జాబ్ చేయడం అనేది కొంచం కష్టం ఒక్క జాబే కాదు, ఏ పని చేయలేము.
ఉదాహరణకి ఒక చపాతి చేయాలనుకుంటే దానిని పిండి ఎలా కలపాలి ఎలా చేయాలి అనేదానికి ముందు తెలుసుకోవాలి తర్వాత చేయాలి ఫస్ట్ టైం చేసేటప్పుడే సరిగ్గా రావు. కానీ నీటుగా పర్ఫెక్ట్గా చేయాలి అంటే కచ్చితంగా దానిమీద అవగాహన మరియు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరి గా ఉండాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా కోడింగ్ ఏమీ ఉండదు కాబట్టి ఇంత కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అది ఎలా చేయాలి దాని వల్ల ఉపయోగాలు ఏమిటి, అది ఎవరికి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి ఆ తర్వాత దానిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అనేది తెలుసుకోవాలి దానిమీద ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ అనేది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు.
మొదట మనం మొదలుపెట్టినప్పుడు ఏ విషయం గురించి మనకు ఏమీ తెలియదు దాని గురించి నిదానంగా ఒకోక్క విషయం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళితే విజయం సాధించడం అనేది తద్యం.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం డిజిటల్ మార్కెటింగ్ లో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్ కి తగ్గట్టుగా మీరు నేర్చుకుంటే మీరు జాబ్ చేయడం చాలా సులభం ఇందులో ముఖ్యంగా నేర్చుకోవలసినవి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వీటిలో మీరు నైపుణ్యం సంపాదించుకుంటే తప్పకుండా మీకు జాబ్ వస్తుంది.
ఇది కాకుండా ఇంకా కొన్ని వర్క్ అయితే ఉన్నాయి. అది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్ రాయటం ఇమేజెస్ డిజైన్ చేయటం, వీడియోస్ చేయడం, లాంటివి వీటిలో నైపుణ్యం ఉన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ వైపు కి వెళ్ళవచ్చు.
వివిధ రకములైన డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్:
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయవచ్చు, అనేదాని గురించి ఒక చిన్న వివరణ. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ జాబ్ కి ట్రై చేసుకోవచ్చు జాబ్ చేసుకుంటూ మంచి జీతాన్ని కూడా తీసుకోవచ్చు. జాబ్ చేయడం ఇష్టం లేదు అంటే మీకు నచ్చినప్పుడు వర్క్ చేసుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు ఫ్రీలాన్సర్ గా. అది కూడా ఇష్టం లేకపోతే ఒక ట్రైనర్ గా ఉంటే డిజిటల్ మార్కెటింగ్ టీచింగ్ చేయొచ్చు. లేదా సొంతంగా మీరే వెబ్సైట్ పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అప్ ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బ్లాగరు గా చేయవచ్చు లేదా ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు ఇంకా ఇలా చేస్తూ పోతే చాలా రకాలైన ఉపాధి అవకాశాలు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కనిపిస్తుంటాయి.
1 కామెంట్‌లు
At Digital Marketing Thanks for this amazing content.
రిప్లయితొలగించండి