వ్యాపార లక్ష్యాలు - Class2 - Google' s Business Goals and Objectives

Header Ads Widget

వ్యాపార లక్ష్యాలు - Class2 - Google' s Business Goals and Objectives

Google' s Business Goals and Objectives


 వ్యాపార లక్ష్యాలు (Business Goals and Objectives): 

 వ్యాపార లక్ష్యాలు: ఆన్లైన్లో మన వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనే దాన్ని ఇందులో క్లియర్గా చూద్దాం ఆన్లైన్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఎలా తెచ్చుకోవాలి తెచ్చుకోవడానికి గోల్స్ ని ఎలా సెట్ చేయాలి అనేది గూగుల్ వాళ్ళు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశారు.

 ప్రతి బిజినెస్ దాని యొక్క లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి మనం బిజినెస్ ని బట్టి ఆ లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. మనం లక్ష్యాలు  ఎలా చేరుకోవాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి ఫస్ట్ మన బిజినెస్ ఎవరికి ఉపయోగపడుతుంది ఎలాంటి కస్టమర్ కి ఉపయోగపడుతుంది అనేది గుర్తించాలి ఆ తర్వాత వారిని అర్థం చేసుకోవాలి వారి దేని గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురుకొంటున్నారు   అనేది మనం గుర్తించాలి అలాంటి ప్రొడక్ట్స్ ని వాళ్ళకి చేరువ చేసే ప్రయత్నం చేయాలి దీనికి ఇప్పుడు ఆన్లైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.

 కస్టమర్ రిలేషన్ షిప్ :

మన బిజినెస్లో కస్టమర్ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యమైనది.  కస్టమర్ నమ్మకం  గనుక ఉంటే మన బిజినెస్ ని మంచిగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. మనం ఒక ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళాలి  అంటే దాని గురించి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నిజాయితీగా వాళ్లకు చెప్పాలి.  ఇది ఏమిటి దీని వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని మార్కెటింగ్ చేయగలిగినప్పుడే కస్టమర్స్ ని పెంచుకో గలుగుతాం ఆ సక్సెస్ ఫుల్ గా బిజినెస్  రన్ చేయగలుగుతాం

 మనం ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకు వస్తే మన కంటే ముందు ఉన్న చాలా కంపెనీలు same  ప్రోడక్ట్ ని సేల్  చేస్తూ ఉంటారు.  అలాంటి ప్రొడక్ట్స్ ని మనం సేల్  చేయాలి అంటే దానికి ఒక ప్రత్యేకతని ఆపాదించాలి.  ఆ ప్రత్యేకతో మార్కెట్ లోకి  తీసుకెళ్ళి గలగాలి అప్పుడే మన వ్యాపార లక్ష్యాలు నెరవేరతాయి.    

ఉదహరణ:  మార్కెట్లో చాలా రకాల టీ పొడులు  నమ్ముతారు కానీ ఆ టీ పొడి ఒక బ్రాండ్ ను క్రియేట్ చేయాలి అలా ఎప్పుడైతే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేయగలుగుతామొ అప్పుడు  ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడానికి మార్గం చాల సులభం అవుతుంది.  బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే మార్కెట్లో ఉన్న  అన్నిటీ  పొడులకంటే  ప్రత్యేకమైన గుణాలు చూపించగలగాలి. వాటిలో అయితే రకరకాల ఫ్లేవర్లు అంటే వాసనలు వచ్చేలాగా దాంట్లో, ఆరోగ్య లక్షణాలు ఉండేలాగా, జాగ్రత్తలు తీసుకోవాలి.  అప్పుడు మా ప్రొడక్ట్స్ లో ఈ ఆరోగ్యకరమైన లక్షణం ఉంది అని జనం లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది.  అది నచ్చితే ఇంకా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు, బ్రాండ్  క్రియేట్ అవుతుంది, తర్వాత ఆ బ్రాండ్ పేరు మీదనే ఎక్కువ వ్యాపారం జరగడానికి ఛాన్సెస్  ఉంటాయి. 

 లోకల్ బిజినెస్ 

ప్రజెంట్ అంతా ఆన్లైన్ అయిపోయింది నేను ఒకటి ఒక మంచి టీ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా ఆన్లైన్లోనే సెట్ చేస్తున్నారు కాబట్టి మీరు గనక  టీ షాప్ మెయింటెన్ చేస్తున్నారనుకోండి షాప్ ఆన్లైన్లో అందరికీ తెలియాలి,  దీనికి మంచి పరిష్కారం ఉంది, అదే గూగుల్ మై బిజినెస్ ఇందులో షాప్ డీటెయిల్స్ అడ్రస్, టైంయింగ్స్, టి లోని రకాలు వెబ్సైటులో ఇస్తే   లోకల్ గా ఎవరైనా టి గురించి సెర్చ్ చేస్తుంటే వాళ్లకు మీ షాప్ కనిపిస్తుంది, అది చూసి నచ్చిన వాళ్ళు  మీ షాప్ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు లోకల్ బిజినెస్ చేసేవాళ్లు ఇదే ఫాలో అవుతున్నారు.

కస్టమర్ ఇంటరాక్షన్ 

 మీరు కస్టమర్లతో ఇంటరాక్షన్ కావడానికి సర్వీసెస్  లేక ప్రొడక్ట్స్  యొక్క ఫోటోలు లేదా వీడియోస్ ని వెబ్సైటు లో అప్లోడ్ చేయవచ్చు మరియు  ఫేస్బుక్, linkedin, ఇంస్టాగ్రామ్  వంటి వాటిలో కూడా షేర్ చేయొచ్చు.  ఇలా కూడా కస్టమర్స్ తోటి మీరు మంచి ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు ప్రతిరోజు మీరు అప్డేట్ చేయడం వల్ల కస్టమర్ ఇంటరాక్షన్  పెంచుకోవడానికి వీలవుతుంది. 

ఆన్లైన్ అడ్వటైజ్మెంట్

 ఇది కూడా చాలా ఉపయోగకరమైనది, మీ  బిజినెస్ చాలా పెద్దది, దీనిని మీరు  అంతా విస్తరించాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ బాగా ఉపయోగపడుతుంది.  ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ చేయడం వల్ల త్వరగా ఎక్కువ కస్టమర్స్ ని చేరుకొనే అవకాశం ఉంది. 

 వ్యాపార విజయానికి మార్గాలు

  •  మనం ఏ వ్యాపారం చేయగలవు దాని నిర్ణయించుకోవాలి. 
  • దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలం ఆలోచించాలి. 
  •  ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ఎంత రిటర్న్ చేస్తే అనేది మనం ముందుగా లెక్క వేసుకోవాలి. 
  •  అనుకున్న బడ్జెట్లో మనం బిజినెస్ ని స్టార్ట్ చేయాలి.  
  •  ప్రమోషన్స్ ఇది చాలా ముఖ్యమైనది ఎంత మంచిగా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోగలిగితే మనకి అంత రిటర్న్స్ వస్తాయి. 
  •  ముందుగా కస్టమర్ అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి సర్వీసెస్  లేదా ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నారు అనేది చూడాలి. 
  • ఎంత త్వరగా నమ్మకమైన సర్వీసుని ఇవ్వగలుగుతమ్  అనేది చాలా ముఖ్యం  అదే మన బిజినెస్ నిలబెడుతుంది. 

కంక్లూజన్

 ఈ డిజిటల్ ప్రపంచంలో మనకి అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే దాగి ఉంటుంది మన   విజయం. ముందు మనం ఏ వ్యాపారం ప్రారంభించాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి   తర్వాత దాని యొక్క కస్టమర్ ఇంట్రెస్ట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి.  గోల్ ఓరియెంటెడ్ గా పని  చేయడం స్టార్ట్ చేయాలి.  గూగుల్ వాళ్ళు ఎనలిటిక్స్ టూల్స్  కూడా ఇస్తున్నారు.  ఆ ఎనలిటిక్స్ టూల్స్ ద్వారా మన బిజినెస్ అనాలసిస్ చేయవచ్చు అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా దాని ప్రకారం మనం ఎక్కడ కరెక్ట్గా లేమో సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి కూడా చాలా మంచి అవకాశం అయితే ఉంది.  కస్టమర్ ఎలా ఆలోచిస్తారు అనే దాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాం అప్పుడే మన బిజినెస్ ని వారికీ దగ్గర చేయగలుగుతాం. 

 తర్వాత క్లాస్ లో ఎన్ని రకాలుగా మన ఆన్లైన్ లో బిజినెస్ ని ముందుకు తీసుకు వెళ్ళవచ్చు అనేదాని గురించి డిస్కస్ చేద్దాం. 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు