ఉద్యోగాలను ఎలా సృష్టించుకోవాలి
ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అందరూ చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అనేక రకాలా కోర్సులు నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ కోర్స్, నెట్వర్కింగ్ కోర్సులు, మొదలైనవి. కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి జాబ్ వస్తుంది కానీ కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు ఈ టైం లో టైం వేస్ట్ చేయకుండా సొంతంగా మనమే ఎలా జాబ్ తెచ్చుకోవాలి చూద్దాం.
కొంతమంది కోర్సులు పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ట్రై చేసి రాకపోతే, వేరే కోర్సులు నేర్చుకుంటారు. ఇలాంటి వాటికి ఒక చిన్న పరిష్కారం చూద్దాం. చదువు అయిపోగానే ఏదైనా సరే చిన్నదయినా ఏదైనా సరే జాబు జాయిన్ అందులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఫ్యూచర్ లో మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న పని అని వదిలేయ్ ఒద్దు చిన్న జాబ్ చేస్తూనే పెద్ద జాబ్ ఎలా చేయాలి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఏం చేయాలి, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము చూసుకొని సరిచూసుకోండి.
ప్రస్తుతం మనకి ఇంటర్నెట్ లో అన్ని రకాల విషయాలు, సబ్జెక్టులు మొత్తం ఉన్నాయి, మనకి ఏ కోర్సు కావాలో ఎంచుకుని దాన్లో కంప్లీట్ knowledge తెచ్చుకుని మనము ఎంచుకున్న మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేర్చుకోవచ్చు. విషయం నేర్చుకోవడం ద్వారా మనం జాబ్ సంపాదించుకోవడానికి ప్రజెంట్ చాలా ఉపయోగకరమైన వాతావరణం అయితే ఉంది.
ఉదాహరణకి డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతిదీ ఇంగ్లీషులోనూ తెలుగులోనూ మనకు ఏ లాంగ్వేజ్ అర్థం అవుతుందో ఆ లాంగ్వేజ్ లో చదువుకోవచ్చు, దానిద్వారా నేర్చుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక ముందు కూడా చాలా ఎక్కువగా జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అవసరం అనేది ఇప్పుడు బాగా పెరుగుతున్నది. బిజినెస్ చేసే వారికి డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఉంది కాబట్టి ఉద్యోగాలు త్వరగా తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కోడింగ్ కానీ ఇంకా వేరే కష్టమైనా కష్టమైన సబ్జెక్టు గాని ఉండవు ఈజీగా నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ లో మంచి స్థితిలో ఉన్న వాళ్ళకి సాలరీస్ కూడా చాలా బాగున్నాయి.
మనమే ఎలా జాబ్ సంపాదించుకోవాలి:
1. డిజిటల్ మార్కెటింగ్ :-
జిటల్ మార్కెటింగ్ లో సల అంశాలు ఉన్నాయి, అందులో ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ఇది నేర్చుకోవడం ద్వారా వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్ లో మొదటి పేజీ కి ఎలా తీసుకురావాలి నేర్పిస్తుంది దీని ద్వారా ఏదైనా ఒక వెబ్ సైట్ ను తీసుకోని వర్క్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.
2 . సోషల్ మీడియా:-
సోషల్ మీడియా బాగా అందరూ ఉపయోగిస్తున్నారు. కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ బిజినెస్ ని రన్ చేస్తారు కాబట్టి మన వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ కి విజిటర్స్ ని పెంచడం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు.
3. ఫ్రీలాన్సర్:-
ఇప్పుడు చాలా మంది ఫ్రీలాన్సర్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు మీకు ఏదైనా కోడింగ్ మీద మంచి పట్టు ఉన్న లేకపోతే డిజైనింగ్ చేస్తున్న, ఎడిటింగ్ చేస్తున్న, ఇమేజ్ బాక్గ్రౌండ్ డిలీట్ చేయడం, ఇమేజ్ క్రియేట్ చేయడం డిజైన్ చేయడం, వీడియో ఎడిటింగ్ , మరియు డేటా ఎంట్రీ వర్క్ లాంటి చిన్న చిన్న వర్క్ ని చాలా కంపెనీలు అందిస్తున్నాయి. నీకు నచ్చిన ఒక వర్క్ నేర్చుకొని దాంట్లో మీకే నాలేజ్ లేకపోయినా దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేర్చుకొని మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేస్తూ, మీ ఫుల్ టైం జాబ్ కి అప్లై చేయవచు.
Freelancer works website list
- Upwork
- Fiverr
- PeoplePerHour
- Guru
- Freelancer
- 99designs
- DesignCrowd
4. టీచింగ్ :-
టీచింగ్ ఫీల్డ్ లో మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ ని జూనియర్స్ కి గాని స్టూడెంట్స్ కి గాని చెప్పవచ్చు. ఫీల్డ్ లో మంచి శాలరీస్ వస్తాయి హోమ్ ట్యూషన్స్ కానీ లేకపోతే ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చు. టీచింగ్ ఫీల్డ్లో ఎప్పుడూ బాగా డిమాండ్ ఉంటుంది. ట్యూషన్స్ గురించి చెప్పే వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి ఆ వెబ్సైటు లాగిన్ తే స్టూడెంట్స్ ని మీకు అసైన్ చేస్తారు మీరు క్లాసెస్ చెప్పుకోవచ్చు.
4. కంటెంట్ రైటింగ్ :-
బాగా డిమాండ్ ఉన్న ఫీల్డ్ , మీకు కొంచం రైటింగ్ స్కిల్స్ ఉన్న మీరు కంటెంట్ రైటింగ్ లో పార్ట్ టైం కానీ ఫుల్ టైం గ కానీ వర్క్ చేయవచ్చు మంచి సాలరీస్ వస్తాయి.
ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయండి లేక పోతే ఫ్రీ గ ఐన వర్క్ చేయండి. ఈ ఎక్సపీరియన్సు తో కంపెనీ లో జాబ్ సంపాదించవచ్చు.
లేదా
మీరు ఒక వెబ్సైటు create చేసుకుని అందులో మీ వర్క్ ని పెట్టండి, సోషల్ మీడియా లో ప్రమోట్ చేయండి. వెబ్సైటు చేయడానికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. మీకు సలహాలు సూచనలు కావాలి అంటే క్రింద కామెంట్ చేయండి.
0 కామెంట్‌లు