సోషల్ మీడియా కెరీర్ ఆప్షన్స్:
ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు సోషల్ మీడియాలో మనం సంపాదించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయొచ్చు, ఫుల్ టైం జాబ్ చేయొచ్చు, మరియు పార్ట్ టైం జాబ్ చేయవచ్చు. ఈ జాబ్స్ ఎలా చేయాలో ఆర్టికల్ లో క్లియర్గా చూద్దాం.
సోషల్ మీడియా లో జాబ్ చేయాలన్న ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయాలన్నా మీరు పర్ఫెక్ట్గా సోషల్ మీడియా గురించి నేర్చుకోవాలి. సోషల్ మీడియా ని ఎలా ఉపయోగించాలి సోషల్ మీడియా ద్వారా లీడ్స్ ఎలా తీసుకురావాలి. మనం ఒక కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగా సేల్ చేయాలి లేదా బ్రాండ్ అవర్నెస్ ఎలా తేవాలి, ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేయాలి, కంపెనీ యొక్క బిజినెస్ కి సంబందిచి కస్టమర్స్ని గుర్తిచడం అనేది మనకి తెలియాలి.
సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా వర్క్ చేయొచ్చు
ఈ సోషల్ మీడియాలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అది
- సోషల్ మీడియా మేనేజ్మెంట్
- సోషల్ మీడియా మార్కెటింగ్
సోషల్ మీడియా మేనేజ్మెంట్
ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో రెండు రకాలు ఉంటాయి
- సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోఆర్డినేటర్
- సోషల్ మీడియా కోఆర్డినేటర్
1.సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోఆర్డినేటర్
సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోఆర్డినేటర్ అంటే పోస్ట్ లైక్స్, కామెంట్స్ పెంచడం, ఎక్కువ పేజ్ లైక్ ని పెంచడం, పోస్ట్ ఎంగేజ్మెంట్ పెంచడం, షేర్ చేయడం ఎక్కువ మంది తో ఇంటరాక్ట్ అవ్వడం కస్టమర్స్ కి రిప్లయ్ ఇవ్వడం, లాంటివి చేస్తూ ఉంటారు.
2. సోషల్ మీడియా కోఆర్డినేటర్
సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే సోషల్ మీడియా పోస్ట్ ని ప్లాన్ చేయటం పోస్ట్ ని మరియు ఇమేజెస్ ని క్రియేట్ చేయడం, ఇన్ టైం లో పోస్ట్ చేయడం, క్రియేటివ్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి.
సాధారణంగా అయితే చిన్న కంపెనీలో రెండు రెండు పనులు ఒకరే చేస్తారు. పెద్ద కంపెనీ వచ్చేసరికి చాలా పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండు వేరు వేరు గా ఇస్తారు కానీ ఈ రెండు నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏ పొజిషన్ వచ్చినా మీరు జాయిన్ అవచ్చు అందులో వర్క్ చేయొచ్చు.
సోషల్ మీడియా లో ఎక్కువగా లైక్ షేర్ కామెంట్ తో పీపుల్స్ తో ఇంటరాక్షన్ పెంచితే అప్పుడు ఎక్కువ మందికి కస్టమర్లుకి షేర్ అవుతుంది. బేసిగ్గా వచ్చేసరికి ఈ సోషల్ మీడియా అంతా పీపుల్ ఇంటరాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఎక్కువ మంది మన కంటెంట్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఇంటరాక్ట్ అవుతారో ఆ కంటెంట్ ఎక్కువగా వైరల్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా అల్గోరిథ.
సోషల్ మీడియా మార్కెటింగ్
సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే యాడ్స్ చేయడం. ఫేస్బుక్ యాడ్స్, ఇంస్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, లింకెడి యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, ఇంకా చాల ఉన్నాయి, కానీ మనం ఎక్కువ గ చేసేవి ఇవి. మనము మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం విత్ మనీ తోటి ఎలా ప్లాన్ చేయాలి ఎలా డెమోగ్రాఫిక్ అన్ని చెక్ చేసుకోవడం, యాడ్స్ ఇమేజెస్ , వీడియోస్ క్రియేట్ చేయడం, యాడ్స్ కి తగ్గట్టు కంటెంట్ ని క్రియేట్ చేయడం వాటిని ఏ టైం లో పోస్ట్ చేయాలని చూసుకోవడం, ఎంగేజ్మెంట్ ఎంత వస్తుంది ఎంత మందికి రీచ్ అవుతుంది కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లీడ్స్ తేవడం, ఫేస్బుక్ లైక్స్ పెంచడం, ఫాలోవర్స్ పెంచడం , వెబ్సైటు ప్రమోట్ చేయడం లాంటివి ఉంటాయి.
ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు క్రియేటివిటీ సైడ్ వెళ్లగలరా లేకపోతే యాడ్ సైడ్ వెళ్తారని మీకు ఎక్కువగా క్రియేటివిటీ నాలెడ్జ్ ఉండి పీపుల్స్ తో ఇంటరాక్ట్ అవ్వగలిగితే మీకు సాయిల్ మీడియా జాబ్స్ ఈజీగావస్తాయి.
మీకు అడ్వర్టైజింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇమేజ్ క్రియేట్ చేసి పీపుల్స్ కి షేర్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలం ఎంత రిటర్న్ వస్తాయి అని కాలిక్యులేట్ చేయగలను అనుకొంటే సోషల్ మీడియా మార్కెటింగ్ వైపు మీరు ఎంచుకోవచ్చు. ఎంత బడ్జెట్ కి ఎంత రిటర్న్ ఆఫ్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఓ ఐ తీసుకు రాగలరు అనేది ముఖ్యం.
మీరు జాబ్ చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అప్రోచ్ అవ్వవచ్చు అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ అఫ్ క్లైంట్స్ ఉంటారు. వేరు వేరు డొమైన్ మీద వర్క్ చేసే పని చేసే వెసులుబాటు ఉంటుంది. అదే మీరు ఫ్రీలాన్సర్ గా వెళ్లాలనుకుంటే ఒక్క డొమైన్ మీద వర్క్ చేస్తారు. ఫోకస్ అంతా మీదే ఉంటుంది కాబట్టి ఎక్కువ డొమైన్ knowledge నేర్చుకొనే అవకాశం ఉంటుంది.
మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ లో జాబ్ చేయాలి అనుకుంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ బాగుండాలి. అప్పుడు మీకు మంచి సాలరీస్ వస్తాయి.
0 కామెంట్‌లు