లీడ్ జనరేషన్ టెక్నిక్ పరిచయం
లీడ్ జనరేషన్ టెక్నిక్ ప్రతి ఒక్కరికీ అవసరమే, ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి దీని ద్వారానే ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని గానీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
సహజ పద్ధతుల ద్వారా మనం కస్టమర్స్ ని లేదా యూజర్స్ ని మన బిజినెస్ కి ఎలా తెచ్చుకోవాలి అని అంటే ఈ లీడ్ జనరేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది అంత డబ్బులు పెట్టి తెచ్చుకో లేని వాళ్ళు ఉచితంగా ఎలా తెచ్చుకోవాలి?, అనే దాన్ని మనం తెలుసుకుందాం చిన్న కంపెనీల వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్లకి ఈ టెక్నిక్స్ అనేది బాగా ఉపయోగపడతుంది. ఎవరైతే జాబ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను వారు ఈ టెక్నిక్ నేర్చుకోవాలి దానిని మీరు పనిచేసే ప్రాజెక్టు కి అప్లై చేయవచ్చు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం, చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనది.
ఉదాహరణకి ఒక స్కూల్ తీసుకున్నాం ఆ స్కూల్ వాళ్లకు ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ కావాలి. ఎలా తెచ్చుకుంటారు? అంటే ఇళ్ల కి ఎంప్లాయిస్ ని పంపించి పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి, మంచి సదుపాయం కల్పిస్తున్నాం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు చెపుతాము, ఆటలు,పాటలు అన్ని నేర్పిస్తాము అని చెపుతారు, వాళ్ల దగ్గర ఉన్న సౌకర్యాలు చూసి మనం మన పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించడానికి ముందుకు వస్తాం.
కిరాణా షాప్ తీసుకున్నా సరే వారికి ప్రతిరోజు కస్టమర్స్ వచ్చి వర్క్ షాప్ లో వస్తువులు కొనుక్కోవాలి షాప్ లో ఏమేమి ఉన్నాయి, అవి పక్క షాప్ లో పోలిస్తే ఎంత తక్కువ ధరకు వస్తున్నాయి ఎంత నాణ్యమైన దో వివరిస్తారు, ఇలా అన్ని విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు.
ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది ప్రపంచం మొత్తం డిజిటల్ అయిపోయింది. కాబట్టి మనం కూడా ఇంటర్నెట్ ని ఉపయోగించుకొని వ్యాపారం చేయాలి, కస్టమర్స్ ని తెచ్చుకోవాలి దాని కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వాటిని మనం ఉపయోగించుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
లీడ్జ నరేషన్ టెక్నిక్స్ లో రకాలు
ఈ లీడ్ జనరేషన్ టెక్నిక్స్ రెండు రకాలుగా ఉంటాయి.
1. డైరెక్ట్ లీడ్ జనరేషన్
2. ఇన్ డైరెక్ట్ లీడ్ జనరేషన్
1. డైరెక్ట్ లీడ్ జనరేషన్
డైరెక్ట్ లీడ్ జనరేషన్ అంటే ప్రత్యక్షంగా మనం మనకి కావాల్సిన వివరాలు స్వీకరించడం. అంటే మనం ఒక పోస్ట్, ఇమేజింగ్ లేక ఒక బ్లాగు కంటెంట్ని షేర్ చేసినప్పుడు డైరెక్టుగా వాటి నుంచి మన వెబ్ సైట్ కి వచ్చేవాళ్ళని డైరెక్టర్ లీడ్స్ అని అంటారు.
2. ఇన్ డైరెక్ట్ లీడ్ జనరేషన్
ఇన్ డైరెక్ట్ లీడ్ జనరేషన్ అంటే పరోక్షంగా మనం మనకు కావలసిన బిజినెస్ వివరాలని తెచ్చుకోవటం. అంటే ఫేస్ బుక్ పేజీలో కాల్ టు యాక్షన్ బటన్ పెట్టడం కానీ, ఫామ్ ఫిల్ చేయడం కానీ, ల్యాండింగ్ పేజీ పెట్టడం కానీ, ఇలా తెచ్చుకోవడాన్నీ ఇన్ డైరెక్ట్ లీడ్ జనరేషన్ అంటారు.
ఫేస్బుక్ లీడ్ జనరేషన్ టెక్నిక్స్
ఫేస్బుక్ లీడ్ జనరేషన్ టెక్నిక్స్ ని ఫేస్ బుక్ పేజ్ మీద అప్లై చేయాలి ఒక పేజి బిజినెస్ క్రియేట్ చేసుకొని అందులో పోస్ట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మనం లీడ్స్ జెనరేట్ చేయగలం.
1. ఇమేజస్
ఫేస్బుక్ లో ఇమేజ్ ఎక్కువమందికి రీచ్ అవుతుంది ఇది ఒక సర్వేలో తెలిసిన విషయం ఈ రోజుకి ఎక్కువగా ఇమేజెస్ ద్వారా ఎక్కువ మందికి మన వివరాలను చేరవేస్తుంది, ఫేస్బుక్ కాబట్టి ఇమేజెస్ ని చాలా క్రియేటివ్ గా చేయగలగాలి దానిద్వారా ఎక్కువమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఈ కామర్స్ అయితే పూర్తిగా ఇమేజెస్ మీద ఆధారపడి బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఓ మంచి ఇమేజ్ని క్రియేట్ చేయగలిగిన అప్పుడే బిజినెస్ బాగా విజయవంతం అవుతుంది. ఇమేజ్ ని తయారు చేసేటప్పుడు తక్కువ కంటెంట్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇమేజ్ బాగున్నప్పుడు ఇమేజ్ కంటెంట్ అందరికీ రీచ్ అయినప్పుడు డైరెక్టర్ లీడ్స్ మనకు వస్తాయి.
2. వీడియోస్
వీడియోస్ ఇమేజెస్ తర్వాత ఫేస్ బుక్ లో ఎక్కువ మందిని చేరుకుంటున్నాయి, ఈ వీడియోస్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలి, తక్కువ సమయం లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వగలగాలి, వీడియో అనేది కొంచెం అట్రాక్టివ్ గా చేయాలి చేయాలి. మన కంపెనీ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వెబ్ సైట్ అడ్రస్ ఇవ్వాలి మరియు మన ప్రోడక్ట్ లేక సర్వీస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు ఎవరైనా వీడియో ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి సులభంగా ఉంటుంది.
3. కంటెంట్ :
కంటెంట్ అనేది బిజినెస్ కి ప్రాణం లాంటిది. మనం ఎంత బాగా కంటెంట్ రాయగలుగుతామొ అంత బాగాబిజినెస్ ని చేయగలుగుతాం, మన సర్వీస్ కావాలి అనుకుంటున్నారు అంటే అది మన కంటి మీద ఆధారపడి ఉంటుంది. ఇమేజ్ చేయాలన్నా, ఒక వీడియో తీయాలన్నా, ఒక వెబ్ సైట్ క్రియేట్ చేయాలి అన్నా, కంటెంట్ చాలా ముఖ్యమైనది. క్వాలిటీ కంటెంట్ ఉండాలి, ఎక్కడ కాపీ చేయకూడదు, సొంతంగా క్రియేటివ్గా రాయగలగాలి
4. పేస్ బుక్ గ్రూప్స్ :
ఫేస్బుక్కు గ్రూప్స్ అనేది ఆర్గానిక్ గా లీడ్స్ ని జనరేట్ చేయడానికి 100% ఉపయోగ పడతాయి, ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి గ్రూప్స్ కావాలన్న అందుబాటులో ఉంటాయి ప్రపంచం మొత్తం ఉన్న గ్రూప్ లో జాయిన్ అవచ్చు ఇమేజెస్ ని షేర్ చేయవచ్చు వీడియోస్ ని షేర్ చేసుకోవచ్చు కంటెంట్ షేర్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ ని అమ్ముకోవచ్చు.
5. ఇమేజ్ పిన్ చేయండి :
ఇమేజ్ పిన్ చేయడం అంటే మనము ఇమేజ్ పోస్ట్ చేసినప్పుడు అన్ని ఇమేజెస్ కన్నా ఒక ఇమేజ్ కి ఎక్కువగా లీడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఇమేజెస్ ని మనం టాప్ లో పిన్ చేసుకోవచ్చు దాని ద్వారా ఎక్కువ లీడ్స్ ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
6. ఫేస్బుక్ ఆఫర్స్ :
ఆఫర్స్ పెట్టడం ద్వారా కూడా మనం లీడ్స్ ని జనరల్ చేసుకోవచ్చు, కూపన్స్ పెట్టడం, ఫ్రీగా ఈ బుక్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటి వాటి ద్వారా కూడా మనం లీడ్స్ తెచుకోవచ్చు.
7. రీ పోస్టింగ్:
మన దగ్గర పాత బ్లాగ్ పోస్ట్ ఒకటి ఉంది దాంట్లో మనకి బాగా లీడ్స్ వస్తున్నాయి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాన్ని రీ పోస్టింగ్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం ద్వారా కూడా మన లీడ్స్ ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
8. ఈవెంట్స్ మరియు వెబినార్:
ఈవెంట్స్ మరియు వెబినార్ సినీ కండక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం మన కస్టమర్ తోటి సత్సంబంధాలను కలిగి ఉండవచ్చు. దాని ద్వారా మన బిజినెస్ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. మనం బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది కూడా ఒక మంచి అవకాశం.
కంక్లూజన్
ఫేస్బుక్ అనేది చాలా శక్తి వంతమైన టూల్, దీని ద్వారా మనం మన కస్టమర్ తోటి సంబంధాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఫేస్బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మన బిజినెస్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళడానికి అన్ని రకాలైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ఈ పద్ధతులను ఉపయోగించుకుని మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోగలిగితే కస్టమర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ కలుగుతుంది, కస్టమర్ కి మన మీద నమ్మకం ఏర్పడుతుంది.
ప్రతిరోజు మన బిజినెస్ని ప్రమోట్ చేసే ఇమేజెస్ లు వీడియోలు కాకుండా అప్పుడప్పుడు పర్సనల్ గా ఇమేజెస్ లు పోస్టులు పెట్టడం ద్వారా వాళ్ళు మన మీద ఒక మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు. పండగలప్పుడు పండగలకు సంబదించిన వి మరియు మంచి మంచి కొటేషన్ లు, వీడియోలు పెట్టాలి.
ఒకసారి మనం పెట్టే బిజినెస్ పోస్ట్లు కన్నా ఇలాంటి పండగ పోస్టులు కానీ ఏదైనా మంచి కొటేషన్ పోస్టులు గాని ఎక్కువమందికి రీచ్ అవుతాయి దాని ద్వారా కూడా మన బ్రాండ్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అందరూ ఉపయోగించుకోండి.
0 కామెంట్‌లు