పరిచయం
ఈ రోజుల్లో వ్యాపారంలో బాగా ఉపయోగిస్తుంది ఫేస్బుక్, ఫేస్ బుక్ లో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నవి వాటిని ఉపయోగించి మనం మన బిజినెస్ని గాని, మన ఉద్యోగాలు చేయవచ్చు, ఈ టిప్స్ చాలా ప్రభావవంతంగా మన బిజినెస్ మీద పనిచేస్తాయి.
పెరుగుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఫేస్బుక్ అనేది అగ్రస్థానానికి వస్తుంది దీనివల్ల ఫేస్బుక్ లో ని కొన్ని విధానాలను కఠినతరం చేశారు, ఎందుకంటే అది యూజర్ ని ఇబ్బంది పెట్టకుండా గోప్యత కి భంగం కలిగించకుండా తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఇలా రకరకాల కారణాల వల్ల ఫేస్బుక్ ని కఠినతరం చేశారు
ఫేస్బుక్ లో మనం మన యూజర్స్ కి కంటెంట్ మీ చేరవేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి . మీరు మీ ఫేస్బుక్ లో అవలంబించవలసిన మార్గాలు, అవి ఇమేజ్ రూపంలో, వీడియో లో, కంటెంట్ రూపంలో గాని యాడ్స్ రూపంలో గాని, మార్కెటింగ్ ప్లేస్ లో కానీ, మరియు మెసెంజర్ ద్వారా, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మన బిజినెస్ ని కస్టమర్స్ తో పంచుకోవచ్చు.
Facebook మార్కెటింగ్ చిట్కాలు :
మనం ఏ విధమైన ఖర్చు పెట్టకుండా మన కంపెనీని ప్రమోట్ చేయడం ఎలా అనేది ఇక్కడ చూద్దాం, మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఉపయోగించుకోవడం ద్వారా మనం మంచి ఉపయోగాలను పొందవచ్చు ఇది ఉద్యోగులు మరియు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే?
ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇవన్నీ నేర్చుకుని వాళ్ళ పని చేస్తున్న ప్రాజెక్ట్ కి ఇవన్నీ అప్లై చేయడం ద్వారా మంచి రిజల్ట్ తీసుకుని రావచ్చు దాని ద్వారా ఈ ఉద్యోగులు మంచి పొజిషన్ కి వెళ్లడానికి సహాయపడుతుంది.
బిజినెస్ చేసే వాళ్ళకి దీనిద్వారా బిజినెస్ చాలా బాగా జరుగుతుంది సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళు ఈ టిప్స్ ని ఫాలో అవ్వొచ్చు.
1. ఫేస్బుక్ పేజ్:
ఈ ఫేస్ బుక్ పేజ్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి అది పర్సనల్ ది కాకూడదు ఎందుకంటే, అన్నిటికంటే ప్రత్యేకత పేజీ లో కనిపించాలి, ప్రత్యేకించి మన బిజినెస్ గురించి అందరికీ తెలియ చేసే విధానాలు అందులో ఉండాలి అలా ఉంటేనే అది మన బిజినెస్ కి సహాయపడుతుంది కొన్ని పర్సనల్ పేజీ లో కొన్ని టూల్ అవైలబుల్ గా ఉండవు, అదే బిజినెస్ బిజినెస్ పేజీ లో అయితే బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, బ్రాండెడ్ పెంచుకోవచ్చు ఫ్యాన్ పేజ్ లైక్ పెంచుకోవచ్చు.
ఈ బిజినెస్ పేజీ క్రియేట్ చేసేటప్పుడు మీరు ప్రత్యేకించి ఏ కేటగిరీకి రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారో చూసి సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేయడం ఇక్కడ ముఖ్యం.
2. ఫేస్బుక్ పేజ్ URL క్రియేషన్ :
ఫేస్బుక్ పేజీ యుఆర్ఎల్ అనేది ముఖ్యం దీన్ని మనం మన బిజినెస్ పేరు మీద క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు మన బిజినెస్ ని ఎక్కువ మంది తెలుసుకునే వీలు ఉంటుంది.
3 కవర్ ఫోటో
ఈ కవర్ ఫోటో అనేది ఒక అద్దం లాంటిది, ఇది బిజినెస్ ని అందరి ముందు ప్రతిబింబించేలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఏమి బిజినెస్ చేస్తున్నామో సర్వీసెస్ ఇస్తున్నాము అవన్నీ ఆ కవర్ పేజీలో క్లియర్గా తెలిసేలా గా డిజైన్ చేసుకోవాలి, అప్పుడు అందరూ తొందరగా గుర్తిస్తారు.
నోట్ : కవర్ ఫోటో సైజ్ 820 x 312 pixel ఉండాలి.
4. లోగో లేక ప్రొఫైల్ పిక్చర్
ఈ ప్రొఫైల్ పిక్చర్ అనేది తన కంపెనీని చూపిస్తుంది అందరికి తెలియజేస్తుంది మన బ్రాండ్ మీ తెలియజేస్తుంది ఎవరైనా మన ఫేస్బుక్ పేజీ కోసం వెతుకుతుంటే మన లోగో ద్వారా మనల్ని త్వరగా గుర్తించగలుగుతారు.
నోట్ : ఈ లోగో సైజు 170 X 170 pixels ఉండాలి.
5. అబౌట్ సెక్షన్ :
అబౌట్ సెక్షన్ అంటే బిసినెస్ గురించి తెలియజేయడం ఎవరైనా మన పేజీ ని ఫస్ట్ టైంచూసినప్పుడు, వాళ్లు మన అబౌట్ సెక్షన్లో చూస్తారు అందులో క్లుప్తంగా మన బిజినెస్ గురించి రాయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ వెబ్ సైట్ అడ్రస్ ఆఫీస్ టైమింగ్స్ ఇలా అక్కడ ఇచ్చిన ప్రతి దానిని నింపాలి దీనివల్ల ఎక్కువ మంది మనల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది.
6.కాల్ టు యాక్షన్ బటన్ :
ఇది కూడా చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఎవరైనా క్లైంట్స్ మనల్ని కలుసుకోవాలంటే వాళ్ళు ఆ బటన్ ని క్లిక్ చేసి బిజినెస్ ఓనర్స్ ని కలుస్తారు.
ఎన్ని రకాలుగా మనం బటన్ సెలెక్ట్ చేసుకోవాలి: కాల్ టు యాక్షన్ బటన్స్ మన బిజినెస్ కి తగ్గట్టుగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం .
- సైన్ అప్ అని ఉంటుంది ఇది ఎడ్యుకేషన్, ఇమ్మిగ్రేషన్ వాళ్ళకు వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది.
- షాప్ నౌ ఇది ఉపయోగపడుతుంది ఏ కామెర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఈ బటన్ ఉపయోగపడుతుంది.
- బుక్ నౌ అనేది మనం ఏదైనా టికెట్స్ కొనుక్కోవడం అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది.
- ఆప్ అనేది వాళ్ళకి అప్ తయారు చేసే డౌన్లోడ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
- వాచ్ వీడియో వీడియో ప్రమోట్ చేసే వాళ్ళకి ఈ బటన్ ఉపయోగపడుతుంది.
- ప్లే గేమ్స్ గేమ్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది.
0 కామెంట్‌లు