ఆన్‌లైన్ వ్యాపార విజయంలో మీ మొదటి అడుగు | Your First Steps in Online Success - Class 4

Header Ads Widget

ఆన్‌లైన్ వ్యాపార విజయంలో మీ మొదటి అడుగు | Your First Steps in Online Success - Class 4

Your First Steps in Online Success


  పరిచయం :

ఈ రోజు లో ప్రతి ఒక్కటి  మనం ఆన్లైన్లోనే చేస్తున్నాము, ఈ మెయిల్ పంపించడం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం, ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం, ప్రతిది  ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం, ఆన్లైన్  అనేది  ఒక వరల్డ్,  డైలీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. 

 మనం ప్రతి రోజు చాలా టైం ఆ ఆన్లైన్లోనే గడుపుతున్నాము, ఎందుకంటే అందులో రాసే కంటెంట్ను చదవడానికి, విషయాలు తెలుసుకోవడానికి,  మనకు అవసరమైనవి  ఉపయోగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం.  మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ని ఆన్ లైన్ లో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాము, ఇంటర్నెట్ బాగా విస్తృతంగా వాడుకో వాడుకలోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది, ప్రపంచం నలుమూలల ఏం జరిగినా మనకి క్షణాలలో తెలుస్తుంది.  ఈ రోజుల్లో మనం ఏదైనా బిజినెస్ ఆన్లైన్లో చేయాలన్న  చాలా ఈజీ అయిపోయింది, పూర్వకాలంలో అయితే ఆఫీస్ దాంట్లో కి కావాల్సిన systems, కుర్చీలు ఇలాంటివన్నీ కావలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆన్లైన్లో చేయడం ద్వారా ఆఫీసు అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే మన బిజినెస్ ని చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర నుండే ప్రపంచంలో ఏ మూలన అయినా మనం బిజినెస్ చేసుకోవచ్చు అంత మంచి ఆపర్చునిటీ తీసుకు వచ్చింది ఈ డిజిటల్ మార్కెటింగ్. 

 ఆన్ లైన్ ద్వారా మన షాపింగ్ చేయడం, చదువుకోవడం ఇలా ప్రతి దానికి ఉపయోగించుకుంటూ నే ఉన్నాము  ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడం అంతా ఆన్లైన్ లో చేస్తున్నాము  ఇది ఒక మంచి పరిణామం.  కొత్తగా ఆలోచించి మన బిజినెస్ ఆన్లైన్ లోకి తీసుకు వెళ్లడం అనేది మన బిజినెస్ యొక్క ఉన్నతి తోడ్పడుతుంది డిజిటల్ వరల్డ్  అనేది విస్తృతంగా పెరిగిపోయింది మన ప్రపంచం  అంతా  డిజిటల్ ప్రపంచం గా మారిపోయింది. 

 వ్యాపారం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి?

మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది ముందు ఆలోచించాలి దీనికి పరిష్కారంగా గూగుల్ వాళ్ళు మనకి ఒక డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి ఆన్లైన్లో ఇస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ పేరుతో ఈ కాన్సెప్ట్ ని మీరు నేర్చుకోవడం ద్వారా  ఎలా స్టార్ట్ చేయాలి మన బిజినెస్ ని ఎలా గ్రోత్ ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. 

 డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేవి మీకు మంచి నమ్మకాన్ని అందిస్తాయి.  కంటెంట్ మార్కెటింగ్ చేయాలనుకున్నా ఆన్లైన్లో అడ్వటైజ్మెంట్ చేయాలనుకున్నా, మొబైల్ మార్కెటింగ్ చేయాలనుకున్నా లేదు ఆన్లైన్లో సేల్స్ చేయాలి అన్న  డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి

డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ తో గూగుల్ వాళ్ళు వీడియోస్ present  చేస్తున్నారు ఈ వీడియోస్ లో కాన్సెప్ట్ నేర్చుకొని క్విజ్ లో పాటిస్పేట్ చేసి మీయొక్క knowledge పెంచుకోవచ్చు మీకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటే రీఫ్రెష్ అవ్వచ్చు. 

ఆన్‌లైన్ వ్యాపార విజయంలో మీ మొదటి అడుగు:

 ఆన్లైన్ బిజినెస్ స్ట్రాటెజీ :

మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ఆన్లైన్ బిజినెస్ స్ట్రాటెజీ నేర్చుకోవచ్చు.  మీ వెబ్ సైట్ ని ఎలా చేయాలో నేర్చుకోవచ్చు.  మీరు ఎనలిటిక్స్ టూల్స్ యూస్ చేసుకొని ఆన్లైన్ మీ వెబ్సైట్  వర్క్  ఫార్మెన్స్ ఎలా ఉంది  అని తెలుసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ ను బట్టి ఇక్కడ ఆన్లైన్ టాపిక్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు మరియు మీ బిజినెస్ ని  బాగా పాపులర్   చేయడానికి బాగా సహాయపడుతాయి.  డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ని అనుభవం ఉన్నవాళ్లు తయారు చేసారు , ప్రతి  ఒక్కరికి అర్థమైయేవిధంగా  వీడియోస్ చేశారు. మీరు నేర్చుకోవడం ద్వారా మీరు  మంచి సబ్జెక్ట్ అయితే వస్తుంది ఈ సబ్జెక్ట్ ఉపయోగించి ఆన్లైన్ లో సేల్స్  ఎలా పెంచుకోవాలి లేదంటే వెబ్ సైట్ ను ఎలా సెర్చ్ ఇంజిన్ లో ఇండెక్స్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు. 

 డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో మీకు నచ్చిన టైం లో మీకు నచ్చిన టాపిక్ నేర్చుకోవచ్చు  దీని ద్వారా మీ బిజినెస్ ను  మెరుగు పరుచుకోవచ్చు లేదంటే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు

 డిజిటల్ మార్కెటింగ్ లో సక్సెస్ కావడానికి మొదటి అడుగు

  అందరికీ  మన బిసినెస్ తెలియాలి అంటే పేపర్లో, T.V , కరపత్రాలు, బ్యానర్  యాడ్ చేయడం,  ఇలా రకరకాలుగా ఉంటుంది.   కానీ ఇప్పుడు  ఆ  అవసరం లేకుండా ఒక టేబుల్ ముందు కూర్చుని ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వాటికి సంబంధించిన వీడియోస్ చేయడం వాటిని అప్డేట్ చేస్తుంటే, సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ద్వారా  ఫిజికల్ యాడ్స్ కన్నా కూడా చాలా త్వరగా ఎక్కువమంది కస్టమర్స్ ని చేరుకొనే  ఛాన్స్ ఉంది.   అలాగే  ప్రొడక్ట్స్ లేక  సర్వీసెస్ ఏంటి అవి ఎలా ఉపయోగపడతాయి దానికి  సంబంధించిన అన్ని విషయాలు ఆ అప్లోడ్ చేస్తూ ఉండాలి,  కస్టమర్ దగ్గరికి  రివ్యూస్ తీసుకొని వాటిని వెబ్సైటు లో పెట్టాలి.  ఈ కస్టమర్ రివ్యూస్ బిజినెస్ కి బాగా  హెల్ప్ అవుతాయి.  కొన్ని ప్రొడక్ట్స్  అయితే కస్టమర్ రివ్యూస్ మీదనే ఆధారపడి  అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. 

 వ్యాపార అభివృద్ధి:

ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన బిజినెస్ని లోకల్ బిజినెస్  లో పెట్టుకోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు,  వెబ్సైట్ పెట్టుకోవచ్చు, అప్  డెవలప్ చేసుకోవచ్చు,  ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మన ప్రొడక్ట్స్ ని కస్టమర్కి చేరువ చేయడానికి చాలా సులభమైన మార్గలు 

 గూగుల్ మై బిజినెస్ ఇది లోకల్ కస్టమర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.  ఒక వెబ్ సైట్ ని  కూడా గూగుల్ మై  బిజినెస్ ద్వారా  చేయొచ్చు.  బిజినెస్ వెబ్సైట్ ఉండటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. వెబ్సైట్లో ఒక ఫోన్ నెంబరు ఇవ్వాలి. మ్యాప్ లోకేషన్ 
అండ్ ఫిజికల్ అడ్రస్ని ఇవ్వచ్చు ఇవన్నీ కూడా కస్టమర్స్ మీ షాప్ తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.  వాళ్లకి ఏమి కోరుకుంటున్నారో అది తెలుసుకుని వెబ్సైట్లో అందించగలిగితే  మీ బిజినెస్ చాలా బాగుంటుంది. 

 ప్రజెంట్ యాప్స్ కూడా మార్కెటింగ్ కి బాగా ఉపయోగపడుతున్నాయి,  చాలా బిజినెస్ లు అప్స్ తో నే ప్రారంభం అవుతున్నాయి.  మీరు ఒక యాప్ తయారు  చేసుకుని మీ బిజినెస్ ని అలా కూడా ముందుకు తీసుకెళ్లడి. 

కస్టమర్స్ ని ఆన్లైన్లో ఎలా తెచ్చుకోవాలి:

 మనం కస్టమర్స్ ని ఆన్లైన్లో ఎలా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ గూగుల్లో సెర్చ్ చేస్తారు వాళ్ళకి కావలసిన ప్రొడక్ట్స్ గాని సర్వీస్  కానీ, అడ్రస్ కానీ, ప్లేస్ కానీ ఏదైనా సరే అన్నిటికీ సెర్చ్ ఇంజిన్ మీద ఆధార పడతారు, కాబట్టి మన వెబ్ సైట్ తయారు  చేసి  దానిని సెర్చ్  ఇంజిన్ లో మొదటి పేజీ లో కనిపించే విధంగా పని చేయగలిగితే  మనం సక్సెస్ అవుతాము.  రెండు రకాలైన మార్గాలు ఉన్నాయి. 

  1.  సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ 
  2.  సర్చ్ఇంజన్ మార్కెటింగ్ 

సెర్చ్  ఇంజన్ ఆప్టిమైజేషన్ : 

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది మన గురించి ప్రోడక్ట్ లేక సర్వీసెస్ గురించి  గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారో వాళ్లకి అదే అదే ప్రోడక్ట్ ని చూపిస్తుంది.  మనం సచిన్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లో మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మన వెబ్ సైట్ లు ప్రెజెంట్ చేయొచ్చు. 

 సర్చ్ ఇంజన్ మార్కెటింగ్:  

సర్చ్ ఇంజన్ మార్కెటింగ్  అంటే మన ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్ చేస్తారు. ఈ విధానం లో మనం కీవర్డ్స్ , బీడ్  ని బట్టి మన ప్రొడక్ట్స్ లేక సర్వీసెస్ ఆన్లైన్ లో కనిపిస్తాయి. దీనిని గురించి తరువాతి క్లాస్ లో తెలిసుకుందాము. 

Follow below class:

Class1 : డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్ 

Class2 : వ్యాపార లక్ష్యాలు

Class 3 : వ్యాపార యజమానుల కోసం Google 25 ఉచిత సాధనాలను( టూల్స్ ) అందిస్తుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు