డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్ - Class 1 | Google Fundamentals of Digital Marketing

Header Ads Widget

డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్ - Class 1 | Google Fundamentals of Digital Marketing

Google Fundamentals of Digital Marketing

ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ పరిచయం :  

 డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది. ఎలా నేర్చుకోవాలి దానికి సంబంధించిన విషయాలను వివరంగా కింద ఇవ్వబడినవి. ఈరోజు ప్రపంచం మొత్తం డిజిటల్ ఐపోయింది అందరూ ఇంటర్నెట్ బాగా ఉపయోగిస్తున్నారు, వారిఅందరికి ఈ ఫండమెంటల్స్ ఆఫ్  డిజిటల్ మార్కెటింగ్ చాల  హెల్ప్ అవుతుంది. 

 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు.  మన  ఆడియన్స్కి చేరుకోవాలంటే ఇంటర్నెట్ చాలా ఉత్తమమైన మార్గం. మార్కెటింగ్ ని  డిజిటల్ రూపంలో చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత  మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది.  ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఒక్కొక్కళ్ళకి దాని గురించి చెబుతూ వెళ్లే వాళ్ళు, తర్వాత రేడియోలు, టీవీలు, వచ్చి మార్కెటింగ్ రూపాన్ని మార్చినాయి.  కానీ డిజిట్ల మార్కెటింగ్ వచ్చిన తరవాత మార్కెటింగ్ కంప్లీట్ గ చేంజ్  అయింది.  ఈ  డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎవరికైతే ప్రొడక్ట్స్ కావాలో  వాళ్లకు చెప్పడం ద్వారా టైం అవుతుంది మనీ కూడా సేవ్ అవుతున్నాయి అందువల్ల ఈ డిజిటల్ మార్కెటింగ్ బాగా పాపులర్ అయింది.

 ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆ డిజిటల్ మీదే ఆధారపడుతున్నారు ఎవరైనా ఒక షాప్ కావాలి అంటే దాని అడ్రస్ పేరు టైప్ చేసి అడ్రస్ తెలుసుకుంటున్నారు లోకల్ అడ్రస్, టికెట్స్ బుక్ చేయాలి అన్నా ఏదైనా ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అన్న అందరూ ఆన్లైన్లో ఉపయోగిస్తున్నారు.

ఎలా నేర్చుకోవాలి ?

 డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే వెరీ సింపుల్, గూగుల్ free డిజిటల్ మార్కెటింగ్ classes  ప్రొవైడ్ చేస్తుంది.  అందులో లాగిన్ అయ్యి క్లాసెస్ నేర్చుకోవచ్చు.

ఇందులో గూగుల్ వాళ్ళు నేర్పించేది కంటెంట్ రైటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, మొబైల్ మార్కెటింగ్,  ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ని షేసేల్  చేయడం.

 ఈ గూగుల్ వాళ్ళు వీడియోస్ నేర్చుకోవడానికి వీలుగా ఉంటాయి, వీడియోస్ ద్వారా నేర్చుకున్న దాన్ని గుర్తు పెట్టుకోవడానికి క్విజ్  ఇస్తారు, మనం బాగా నేర్చుకుని దాని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా ఈజీ అవుతుంది.  చాలా బాగా ప్రిపేర్ చేశారు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్సేస్

 ఆన్లైన్ లో బిజినెస్ ని ఎలా  చేయాలి, వెబ్ సైట్ ని ఎలా తయారు చేయాలి, మనం ఎలా వర్క్ చేయాలి ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచబడ్డాయి. 

ఎనలిటిక్స్ టూల్స్

 బిజినెస్ ఎలా అవుతుందో తెలుసుకోవడానికి ఎనలిటిక్స్ టూల్స్ ఇస్తారు. ఈ  ఎనలిటిక్స్ టూల్స్  ద్వారా వెబ్ సైట్ కి ఎంత మంది వస్తున్నారు,  ఎ  లొకేషన్ నుంచి వస్తున్నారు, వాళ్ళ డెమోగ్రాఫిక్ ప్రతిది  తెలుసుకోవచ్చు, ఎక్కువగా ఏ కేయూవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏ పోస్ట్ ఎక్కువ మంది కి చేరుకొంది, ఏ ప్రదేశం  నుంచి జనాలు వస్తున్నారు తెలుసుకొని ప్రమోట్ చేసుకోవడం ద్వారా మన వెబ్ సైట్  సెర్చ్ ఇంజిన్ లో మొదటి పేజీలో వచ్చే చాన్సు ఎక్కువగా ఉంటాయి. 

సర్టిఫికెట్ 

 గూగుల్ వాళ్ళు సర్టిఫికెట్  ఇస్తున్నారు: ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లోమీకు నచ్చిన వి  సెలెక్ట్ చేసుకుని మీకు టైం లో మీకు నచ్చిన టైంలో ప్రిపేర్ అవుతూ క్విజ్  లో పాటిస్పేట్ చేస్తూ మంచి knowledge  తెచ్చుకొని ఎగ్జామ్ రాసి మీరు సర్టిఫికెట్ పొందొచ్చు.  ఈ సర్టిఫికెట్ మీకు చాలా విలువైనది ఈ సర్టిఫికెట్ ద్వారా మనకి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా  ఉంటాయి. 

 క్వాలిఫికేషన్ 

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు మీరు ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే చాలు,  లాజికల్గా ఆలోచిస్తే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. 

 కన్ క్లూజన్ 

డిజిటల్ మార్కెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద మార్కెట్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏమీ చేయలేరు, కాబట్టి ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ కావాలి కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ మంచిగా నేర్చుకో ఈ  సర్టిఫికెట్ మీరు రెస్యూమే లో పెట్టుకొనే జాబ్ కి అప్లై  చేయడం ద్వారా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది.  మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా డిజిటల్ మార్కెట్ ద్వారా లాభాలు పెంచుకునే అవకాశం ఉంది.  ఈ కోర్సు ద్వారా  మీరు ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు లేదంటే ఒక బ్లాగ్ యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని సొంతంగా మంచి మనీ సంపాదించుకోవచ్చు. 

 ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నారు ఆ టైం మీరు బాగా ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.  ఈ ఫీల్డ్ లో కొత్తగా ఇన్నోవేటివ్ ఆలోచించేవారికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు