డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైనా ఎక్కడినుంచైనా వర్క్ చేయొచ్చు. వర్క్ ఫ్రం హోం చేసేవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో వారరు ఆఫీస్ నుంచి, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయొచ్చు. ఇది నేర్చుకోవడానికి కోడింగ్ అవసరం లేదు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు త్వరగా సంపాదించుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని సంపాదించుకోవచ్చు ఎవరైనా కెరీర్ గ్యాప్ తీసుకున్న వాళ్లు కూడా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఎవరైతే బాగా చదువుకొని డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్ కి వెళ్ళ లేక ఇబ్బంది పడే వాళ్ళు, డిజిటల్ వైపు కి మారాలి అనుకునేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు.
మీరు బిజినెస్ ఉంది అనుకుందాం, అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో మీకు ఏదైనా బిజినెస్ ఉంది మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలి అన్న కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. లేదు మీకు ఏ బిజినెస్ లేదు కానీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా జాబ్ చేయొచ్చు వీడియో ఎడిటర్ గా వీడియో క్రియేటర్ గా కూడా చాలా ఉపాది మార్గాలు ఉన్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ అనేది లేకుండా ఏ వర్క్ లేదు. ప్రతి దానికి మార్కెటింగ్ అనేది అవసరం అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి దానికి మీరు ఏ విధంగా సహాయం చేయగలను అనుకొంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని దాని ఆన్లైన్లో మీరు మార్కెటింగ్ చేయవచ్చు .
డిజిటల్ మార్కెటింగ్ అనేది కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సాఫ్ట్వేర్ స్కిల్స్ అవసరం లేదు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు కామెంట్ చేయగలరు. డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు అందులో ఏవైనా రెండు మూడు మాడ్యూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది మీ ఇంట్రెస్ట్ ను బట్టి మీరు నేర్చుకోవచ్చు ఆప్టిమైజేషన్ అనేది ఒకటి ఉంది.
- సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇది చాలా ముఖ్యమైనది ఇది ప్రతి వెబ్ సైట్ కి ఇది కావాలి.
- వీడియో ఆప్టిమైజేషన్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో వీడియోస్ ని ప్రమోట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇది చాలా అవసరం అవుతుంది.
- సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇది ఉపయోగపడుతుంది అన్నిటికీ మేజర్ గా ఉపయోగపడుతుంది
ఇప్పటివరకు మనం చూసింది ఆప్టిమైజేషన్ అంటే మనీ ఏం పెట్టకుండా ఫ్రీ గా వర్క్ చేయడం మార్కెటింగ్ చేయడం అంటే దాంట్లో కంపల్సరిగా మన కొంత బడ్జెట్ అనేది పెట్టవలసి వస్తుంది. యాడ్ చేయడం ద్వారా మనం బిజినెస్ ని ప్రమోట్ చేయవచ్చు. ఆల్రెడీ బిజినెస్ ఉన్నవాళ్లు బాగా లాభాలు రావాలి అంటే తమకు బిజినెస్ కి తగ్గట్టు యాడ్స్ ని రన్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో గాని యూట్యూబ్ లో గాని ట్విట్టర్లో గాని లేకపోతే సెర్చ్ ఇంజిన్ లో గాని యాడ్స్ చేసుకోవచ్చు. యాడ్స్ అనేది త్వరగా మనకు రిజల్ట్ వస్తుంది మన వెబ్ సైట్ ని ప్రమోట్ చేసుకోవడం గానీ లేకపోతే మన బిజినెస్ కిలీడ్స్ తెచ్చుకోవడం గాని లేకపోతే మన బిజినెస్ ని సేల్స్ చేయడం.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వారు ఈ ముందు టాపిక్స్ గురించి తెలుసుకొండి. తరవాత మిగతా టాపిక్స్ గురంచి తెలుసుకొందాం.
- డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
- అందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి?
- దేనికి ఉపయోగపడుతుంది?
ఇవి తెలుసుకోవాలి ఫస్ట్, తర్వాత SEO సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇది మనం ఫ్రీగా వర్క్ చేయవచ్చు. 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది మన రిజల్స్ రావడానికి. దీనికి గూగుల్ లో మంచి వేల్యూ ఉంది . బెస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మనం ఫ్రీగానే వర్క్ చేయొచ్చు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం ఎలాంటివి దీనివల్ల ఎవరైతే వరకు మన సర్వీసింగ్ కావాలనుకుంటారు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు కావలసిన గ్రూప్ లో షేర్ చేయడం ద్వారా త్వరగా కస్టమర్ కాంటాక్ట్ అవ్వడానికి మంచి మార్గం ఇది.
మార్కెటింగ్ సైడ్ కి వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్ దీంట్లో మనీ పెట్టి యాడ్స్ రన్ చేయాలి. ఫేస్బుక్లో యాడ్స్ చేయవచ్చు, యూట్యూబ్ లో రన్ చేయవచ్చు, లింక్డ్ఇన్, ట్విట్టర్ ,, సోషల్ మీడియా వెబ్ సైట్ లలో చేయడం ద్వారా మన బిజినెస్ పెంచుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ మార్కెటింగ్ ద్వారా కూడా మన ఆ బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకోవచ్చు.
మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా నేర్చుకోవాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ నేను ఈ బ్లాగ్ లో అందిస్తాను మీరు దీన్ని నేర్చుకోవచ్చు.
0 కామెంట్‌లు