సెర్చ్ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది | What is Search Engine Optimization and how does it work?- Class -5

Header Ads Widget

సెర్చ్ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది | What is Search Engine Optimization and how does it work?- Class -5

Search Engine Optimization

 సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పరిచయం :

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఇది మన వెబ్ సైట్ ని గాని వెబ్ పేజీ  కానీ సెర్చ్ ఇంజన్ యొక్క మొదటి పేజీలో చూపించడానికి ఉపయోగపడుతుంది.  ఇది ఒక సింపుల్ టెక్నిక్ కానీ హార్డ్  వర్క్ చాలా ముఖ్యమైనది.  సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్ ఒక్కటే కాదు బింగ్ , yahoo ఇలా చాలా సెర్చ్ ఇంజిన్స్  ఉన్నాయి.  ఈ సెర్చ్ ఇంజిన్స్ లో మన  వెబ్ సైట్  కనిపించాలి అని అందరు అనుకుంటారు. ఈ వెబ్ సైట్ ను క్రియేట్ చేస్తున్నారు ఇంటర్ నెట్లో పెట్టేస్తున్నారు ఒకే అంశానికి సంబంధించి రకరకాల వెబ్సైట్లు వస్తున్నాయి అలా అన్ని వెబ్సైట్లలో నుంచి మన వెబ్ సైట్ ముందుకు ఎలా తీసుకురావాలి అనేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మనం చేసే పని.

 సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎలా పని చేస్తుంది:

సెర్చ్ఇంజన్లు  అనేవి కొన్ని బూబ్స్ ని వాడతాయి.  అవి మన వెబ్ సైట్ మీకు క్రాల్  చేసి ఆ గూగుల్లో ఇండెక్స్ చేస్తాయి.  ఇండెక్స్ చేయడం అంటే అది టెక్స్ట్ బుక్ లో ఏ పేజీలో ఏ పాఠాలు ఉన్నాయో  సేమ్ అలాగే మన వెబ్సైటు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్లేస్ లో పెట్టేస్తుంది.  సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ గా అల్గారిథం బేస్ మీద ఆధార పడి ఉంటుంది.

 అల్గోరిథం బేస్ మీద ఆధారపడి మన వెబ్ సైట్ అనేది గూగుల్ లో ర్యాంక్ అవుతుంది దీనికి దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. 

1 కీవర్డ్స్ 

2 ఈ సైట్ యొక్క బ్యాక్ లింక్స్ 

3  డొమైన్ అథారిటీ 

4.  మన వెబ్ సైట్ కి వచ్చే ట్రాఫిక్ 

ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ లో కనిపించడానికి.  SEO  సర్వీసెస్ అనేవి ఉచితంగా మనకి ఇస్తున్నారు అని ఒకసారి మనం SEO  స్టార్ట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ రిజల్స్ రావడానికి 6 నెలలు పడుతుంది. 

 SEO  అనేది ఒక ఫండమెంటల్ టాపిక్ ముఖ్యంగా మన SEO  లో ముఖ్యంగా 

  1. లోకల్ SEO   
  2. ఈ కామర్స్ SEO, 
  3. ప్రచురణ/వార్తలు SEO, 

అనేవి చాలా ముఖ్యమైనవి, సెర్చ్ ఇంజెన్స్ అనేవి యూజర్ కి మంచి అనుభవన్ని అందిస్తాయి, సెర్చ్ ఇంజిన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి పని చేస్తూ ఉంటుంది. 

ఉదాహరణ:- మనము ఒక పెన్సిల్ కోసం వెతుకుతున్నాను అనుకోండి మనం పెన్సిల్  టైప్ చేయగానే కంపెనీ పేరు ఎక్కువగా సెర్చ్చేసేవి అన్ని మనకి కనిపిస్తాయి అందులో సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తుంటాము ఆ డేటా మొత్తాన్ని అనేది ఐడెంటిఫై చేస్తుంది తర్వాత మనం వెదికేటప్పుడు ఆటోమేటిక్ గా అది మనకు చూపిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల ఆలోచనా విధానానికి దగ్గరగా technology తీసుకొస్తున్నారు. 


ఆర్గానిక్ సెర్చ్ అనేది మన బిజినెస్ కి చాల ఉపయోగపడుతుంది,  ఎవరైనా ఏ టైంలో అయినా క్లైంట్స్ వారికీ  కావలసిన సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ  సెర్చ్  చేసినప్పుడు మన యొక్క వెబ్ సైట్ కానీ మన సర్వీసెస్ కానీ మనం ఏదైతే ఆ విషయాన్ని గూగుల్ లో ఇండెక్స్ చేసేన  విషయాన్ని గూగుల్ ప్రతి సారి వారికీ చూపిస్తూ ఉంటుంది.  దానివల్ల మనకు బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది దాని కోసం మనం  తప్పని సరిగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ చేయాలి

కీవర్డ్స్ :

 కీవర్డ్స్ అనేవి మన వెబ్ సైట్ కి గాని సెర్చ్ ఇంజిన్  గాని చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ప్రతి ఒక్కరు సెర్చ్ ఇంజిన్ లో  వెతికేది కీవర్డ్స్ ఆధారంగానే అవి మనం సెలెక్ట్ చేసుకోవడం లోనే ఉంటుంది మన వెబ్ సైట్ ని ముందుకు తీసుకు రావడానికి అవకాశం,   సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటేషన్ తక్కువ ఉండాలి అలాంటి కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనము త్వరగా సెర్చ్ result లో  వస్తాము,  వెబ్సైట్ ర్యాంకింగ్ వస్తుంది.  త్వరగా మొదటి పేజీ లోకి రావడానికి కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. 

బ్యాక్ లింక్స్:

 బ్యాక్ లింక్ అనేవి మన వెబ్ సైట్ కి చాలా ముఖ్యమైనవి, బ్యాక్ లింక్స్ చేయడం అనేది ఎక్కువగా కంపెనీలు ప్రిఫర్ చేస్తాయి.  ఎందుకంటే ఆ బ్యాక్ లింక్స్ ద్వారానే మన wesites కి  సపోర్ట్ అనేది వస్తుంది.  బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడనికి  రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవి 
  1. guest పోస్టింగ్ 
  2. ఆర్టికల్ సబ్మిషన్ 
  3. క్లాసిఫైడ్స్ 
  4. డైరెక్టర్ సైట్స్ 
  5. సోషల్ బుక్ మార్క్ 
  6. బ్లాగ్ కామెంట్ 
  7. ఇమేజ్ షేరింగ్ 
  8. ppt సబ్మిషన్ 
  9. ఫోరం పోస్టింగ్
  10. ఇన్ ఫో గ్రాఫ్ పోస్టింగ్ 
ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మనం మన వెబ్ సైట్ కి బ్యాక్ లింక్స్ తయారు చేసుకోవచ్చు దీనివల్ల మన వెబ్ సైట్ కి బ్యాక్ లింక్స్ వస్తాయి డొమై అథారిటీ వస్తోంది. 

 డొమైన్ అథారిటీ

 డొమైన్ అథారిటీ అనేది బ్రాండ్ స్కోరు ఇది 1 నుంచి 100 వరకు ఉంటుంది, వెబ్ సైట్ నుంచి వచ్చే లింకు మీద ఆధారపడి ఉంటుంది డొమైన్ అథారిటీ రకరకాల విధానాల మీద ఆధారపడి  క్యాలిక్యులేటర్ చేస్తారు అంటే ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి   రూట్ domini మరియు డొమైన్ యొక్క లింకుల మీద ఆధారపడి ఉంటుంది.  దీనివలన సెర్చ్ ఇంజన్ రిజల్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. 

వెబ్ సైట్ ట్రాఫిక్ 

వెబ్ సైట్ ట్రాఫిక్ అనేది మన వెబ్ సైట్ ని విజిట్ చేసే విజిటర్స్  మీద ఆధారపడి ఉంటుంది.  ఎక్కువగా బిజినెస్  జరిగేది వెబ్ సైట్ ట్రాఫిక్ మీదే మన వెబ్ సైట్ కి ఎంత ఎక్కువ ట్రాఫిక్ వస్తే మన బిజినెస్ అంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అని అర్థం, మొదటిసారి మన వెబ్సైట్ కి వచ్చే కస్టమర్లు చాలా ముఖ్యమైనవారు,  ఎందుకంటే పాత కస్టమర్లు మనతో ఉంటారు అలాగే ప్రతిరోజు కొంతమంది కొత్త కస్టమర్లను చేరుకోవడం వల్ల మన బిజినెస్ ని  రోజురోజుకి అభివృద్ధి చేసుకుంటూ పోవచ్చు.  వచ్చిన కస్టమర్లు మన వెబ్ సైట్ మీద ఎంత టైం స్పెండ్ చేశారనే దాని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.  మన వెబ్ సైట్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్ పేజీకి ట్రావెల్ చేస్తూ ఉంటే మనం బిజినెస్ లో లాభాలు రావడానికి చాలా మంచి అవకాశాలు  ఉంటాయి. 

కంక్లూషన్ :

 ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకోండి ఇంగ్లీష్ లో చదవండి మరియు తెలుగులో చదవండి, దాన్ని మీ బిజినెస్ కి కానీ మీ జాబ్ కి కానీ ఎలా అప్లై చేయాలో ఆలోచించండి అలా డిజిటల్ మార్కెటింగ్ లో మీ విజ్ఞానాన్ని పెంచుకోండి.

Recommended for you

Class1 : డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్ 

Class2 : వ్యాపార లక్ష్యాలు

Class 3 : వ్యాపార యజమానుల కోసం Google 25 ఉచిత సాధనాలను( టూల్స్ ) అందిస్తుంది

Class 4: ఆన్‌లైన్ వ్యాపార విజయంలో మీ మొదటి అడుగు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు