పరిచయం:
ప్రతి ఒక్కరు జాబ్ కోసం ఎదురు చూస్తూ చాలా తొందరగా వస్తే బాగుంటుంది అంటూ ఉంటారు కానీ మనం ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి జాబ్ త్వరగా రావాలి అంటే మనం దానికి తగ్గట్టుగా ప్రిపేరవ్వాలి ప్రతిరోజు మనం ఏం జాబ్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాము దానికి తగ్గ టాపిక్స్ మీద దృష్టి పెట్టాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని మనం ప్రయోగాత్మకంగా అది ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూసుకుంటూ ఉంటే మనం జాబ్ త్వరగా తెచ్చుకోవచ్చు.
జాబ్ త్వరగా రావాలి అంటే మనం ముందుగా సబ్జెక్టు మీద పట్టు సాధించాలి అది మనం కాలేజీ లో ఉన్నప్పుడు నుంచి మొదలు పెట్టాలి అప్పుడు అయితేనే మనకి చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత కోర్సు నేర్చుకుని జాబు తెచ్చుకోవాలంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఈజీగా జాబ్స్ ఎలా తెచ్చుకోవచ్చు చూద్దాం. ఉన్న టెక్నాలజీ అన్నింటిలోకి డిజిటల్ మార్కెటింగ్ చాలా సులభంగా ఉంటుంది, కోడింగ్ ఏమీ ఉండదు ఎవరైనా కొంచెం ఇంగ్లీషులో పట్టుకుంటే చాలు ఇది నేర్చుకొని జాబ్ తెచ్చుకో.
డిజిటల్ మార్కెటింగ్ జాబ్ క్వాలిఫికేషన్ :
డిజిటల్ మార్కెట్ కి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉండి తర్వాత కోర్సు చేసి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకునే ఆన్లైన్లోనూ అవైలబిలిటీ ,లో ఉంది క్లాస్ కి వెళ్లి కూడా నేర్చుకోవచ్చు మరియు ఇంటర్నెట్ వీడియో ద్వారా నేర్చుకోవచ్చు.
కోర్సు నేర్చుకుని టైం మరియు శాలరీ:
ఈ కోర్స్ నేర్చుకోవడానికి 45 రోజుల నుండి రెండు నెలల వరకు పట్టవచ్చు అది మీరు నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది, మరియు శాలరీ విషయానికొస్తే ఫ్రెషర్స్ కి 10000 ఉంటుంది కొంచెం పెద్ద కంపెనీలో 15000 20వేల వరకు ఉండొచ్చు ఇది కూడా మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది.
జాబ్ కోసం నేర్చుకోవలసిన డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ :
- డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్,
- వెబ్ సైట్ క్రియేషన్,
- ఎస్ సి ఓ లో ఎక్స్పెక్ట్ అవ్వడం,
- గూగుల్ సర్టిఫికెట్,
- సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అవ్వడం,
- సోషల్ మీడియా మార్కెటింగ్,
- రియల్ టైం ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం
- ఎప్పటికప్పుడు గూగుల్ అప్డేట్ ని ఫాలో అవ్వడం
- డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇన్ నేర్చుకోండి ఇంప్లిమెంట్ చేయడం
డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్:
వెబ్ సైట్ క్రియేషన్:
మనం ఇలా మన పని చేయడానికి మనకి ఒక ప్రాజెక్టు కావాలి, అంటే ఒక వెబ్సైట్ కావాలి ఎవరు మనకి వెబ్ సైట్ వర్క్ చేయడానికి ఇవ్వకపోతే మనమే సొంతంగా ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్ సైట్ చేయడం కష్టం అనుకుంటే ఒక బ్లాగ్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు blogger.com లో మనకి ఫ్రీ గా తయారు చేసుకోవడానికి గూగుల్ వాళ్ళు అవకాశం ఇస్తున్నారు దానిని ఉపయోగించుకొని మనం బ్లాక్ తయారు చేసుకొని దాని మీద మనం వర్క్ చేయవచ్చు డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్లాగ్ అయినా వెబ్సైట్ కైనా ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసుకోండి బ్లాక్ ఎలా క్రియేట్ చేయాలో చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి అందులో చూసి నేర్చుకోండి లేదు అంటే తర్వాత క్లాసులో నేను బ్లాక్ ఎలా చేయాలో చెప్తాను.
SEO లో ఎక్స్పర్ట్ అవ్వండి :
SEO ఎక్స్పర్ట్ అవ్వండి అంటే వాటికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోండి ఇప్పుడు మీరు ఒక వెబ్ సైట్ క్రియేట్ చేశారు దానికి మీరు on-page SEO , Off-Page SEO, Techinical-SEO చేయాలి.
On-page SEO అంటే వెబ్ సైట్ లోపల చేసే పని అన్న మాట అంటే టైటిల్స్ పెట్టడం, డిస్క్రిప్షన్ రాయడం, కీవర్డ్ ఇవ్వడం యు ఆర్ ఎల్(URL) ఇవ్వడం ఇలాంటివి ఎలా ఇవ్వాలి అనే అనే విషయం తర్వాత క్లాస్ లో చూద్దాం.
ఆఫ్ పేజ్ ఎస్ సి ఓ(Off-Page SEO) అంటే మనం వెబ్ సైట్ ని కంప్లీట్ చేసి అందులో వెబ్పేజీని రాసి పెట్టిన తర్వాత వాటికి మనం బ్యాక్ లెన్స్ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇలాంటివి.
Techinical-SEO మనం వెబ్ సైట్ యొక్క ఎర్రర్స్ తెలుసుకోవడం html code గాని వెలిడేషన్ ఎర్రర్స్ ఉంటే చూడడం అనలిటిక్స్,చూడడం స్క్రోల్ ఎర్ర చూడడం.
on-page SEO , Off-Page SEO, Techinical-SEO ఎలా చేయాలో తర్వాత క్లాసులో నేను ఎక్స్ప్లైన్ చేస్తాను.
గూగుల్ సర్టిఫికెట్:
గూగుల్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది మీరు ఎగ్జామ్స్ రాసుకోవచు ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి ఆ క్లాసులు కంప్లీట్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాస్తే గూగుల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది.
సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అవ్వడం:
సోషల్ మీడియా ఈ రోజు మార్కెటింగ్ లో మంచి భూమిక పోషిస్తుంది. ఈ సోషల్ మీడియా ఎలా ఉపయోగించాలి మన బిజినెస్ కి అనేది తెలుసుకోవాలి ఫేస్బుక్ లో పేజీ క్రియేట్ చేయడం గ్రూప్ క్రియేట్ చేయడం, మనం రాసే కంటెంట్ని పేజీ ద్వారా గ్రూప్ లోకి పోస్ట్ చేయడం ముఖ్యమైన పని. అలాగే ఇంకా చాలా సోషల్ మీడియా వెబ్ సైట్ లు ఉన్నాయి అవి లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, pinterest ఇంకా చాలా ఉన్నాయి.
సోషల్ మీడియా మార్కెటింగ్:
ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనము యాడ్స్ ని ప్రమోట్ చేయడం ఉంటుంది. ట్రాఫిక్ పెంచుకోవాలన్న అన్న యాప్ డౌన్లోడ్ చేయించాలన్నా , ఫేస్బుక్ కి ఫాలోవర్స్ పెంచుకోవాలన్న, పోస్టు ఎంగేజ్మెంట్ పెంచాలన్న, వీడియో కి యాడ్స్ కావాలన్నా, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సోషల్ మీడియా మార్కెటింగ్.
రియల్ టైం ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం:
ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్స్ మీద మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే, మనకి జాబ్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఇంటర్న్షిప్స్ కావాలి అంటే www.internshala.com లో అప్లై చేయవచ్చు. మనకి వర్క్ ఫ్రొం హోమ్ ఇంటర్న్షిప్ లు మరియు ఆఫీస్ కి వెళ్లి చేసే ఇంటర్న్షిప్ లు ఉంటాయి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత జాబ్ ఇచ్చే కంపెనీలు కూడా ఉంటాయి ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుంటే మీరు అందులోనే జాబ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎప్పటికప్పుడు గూగుల్ అప్డేట్ ని ఫాలో అవ్వడం:
గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ని తీసుకు వస్తూ ఉంటుంది ఎందుకంటే అది యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటుంది, యూసర్ ఫ్రెండ్లీ గా ఉండటానికి మోసం చేసే వాళ్ల దగ్గర నుంచి యూజర్స్ ని కాపాడటానికి గూగుల్ వాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు, కాబట్టి గూగుల్ ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో వాటిని గమనిస్తూ, తెలుసుకుంటూ, దాని ప్రకారం నేర్చుకుంటూ ఉండండి.
గూగుల్ అప్ డేట్స్ అంటే కంటెంట్, బ్యాక్ లింక్ మరియు కీవర్డ్స్ ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మార్పులు తీసుకు వస్తూ ఉంటుంది వాటిని మనం అనుసరిస్తూ ఉండాలి.
డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇన్ నేర్చుకోండి ఇంప్లిమెంట్ చేయడం:
డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అంటే కీవర్డ్స్ టూల్, కాంపిటేట్రర్ ఎనాలసిస్ టూల్ website backlink checker, SEMrush, Ahref ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని టూల్స్ ఉంటాయి ఈ టూల్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి పని చేస్తూ ఉంటాయి,ఇవి మన బిజినెస్ కి చాలా ఉపయోగపడతాయి ఈ టూల్స్ అన్నిటి గురించి మనం ఇంకొక క్లాసులో చెప్పుకుదాం, ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకుదాం.
మీ కోసం :
Class1 : డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్
Class2 : వ్యాపార లక్ష్యాలు
Class 3 : వ్యాపార యజమానుల కోసం Google 25 ఉచిత సాధనాలను( టూల్స్ ) అందిస్తుంది
Class 4: ఆన్లైన్ వ్యాపార విజయంలో మీ మొదటి అడుగు
Class 5: సెర్చ్ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది
0 కామెంట్‌లు